Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూచ్... నేనిప్పుడే పెళ్ళి చేసుకోను.. తేల్చి చెప్పిన మిల్కీ బ్యూటీ

వెండితెర తెల్లపిల్ల తమన్నా. మిల్కీ బ్యూటీగా గుర్తింపు పొందిన ఈ హీరోయిన్.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో తమన్నా పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Webdunia
శనివారం, 28 జులై 2018 (15:26 IST)
వెండితెర తెల్లపిల్ల తమన్నా. మిల్కీ బ్యూటీగా గుర్తింపు పొందిన ఈ హీరోయిన్.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో తమన్నా పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో తన పెళ్లి వార్తలపై మిల్కీ బ్యూటీ తాజా స్పందించింది. తూచ్.. అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తేల్చి చెప్పింది. ఆమె చేసిన ట్వీట్‌ను పరిశీలిస్తే...
 
'ఒక రోజు యాక్టర్, మరొక రోజు క్రికెటర్, ఇంకొక రోజు డాక్టర్. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని పెళ్లి చేసుకోబోతున్నానంటూ రూమర్లను ప్రచారం చేస్తున్నారు. భర్తను వెతుక్కునే పనిలో నేను చాలా బిజీగా ఉన్నాననే భావనను కలిగింపజేస్తున్నారు. నా జీవితానికి సంబంధించి ఎలాంటి అసత్య ప్రచారాలను నేను అంగీకరించను. ప్రస్తుతానికి సింగిల్‌గా నేను చాలా సంతోషంగా ఉన్నా. నా తల్లిదండ్రులు కూడా అల్లుడిని వెతికే పనిలో లేరు. ప్రస్తుతం సినిమాలతోనే నేను ప్రేమలో ఉన్నా. 
 
ఒకవైపు నేను సినిమాలతో బిజీగా ఉంటే... ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు. ఇలాంటి తప్పుడు వార్తలు ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగిస్తాయి. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే... ఆ విషయాన్ని అందరితో పంచుకుంటా. ఇందులో దాచి పెట్టాల్సింది ఏమీ లేదు. ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోవడం లేదనే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నా. ఇలాంటి అసత్య ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టండి... ప్లీజ్' అంటూ తమన్నా తన ట్వీట్‌లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

పని పురుగులా మారిపోయా, నా ముక్కు వెంట రక్తం పడింది: బెంగళూరు CEO

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

ఆకలిగా వుందని టిఫిన్ సెంటరుకు వెళ్తుంటే అత్యాచారం చేసిన కామాంధులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments