Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి కుమార్తెకు అరుదైన గౌరవం -- వరించిన ప్రతిష్టాత్మక అవార్డు

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (15:38 IST)
అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కు అరుదైన గౌరవం లభించింది. "రైజింగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు"కు జాన్వీకపూర్ ఎంపికైంది. ముంబైలోని నార్వేజియన్ కాన్సులేట్ జనరల్ ఈ అవార్డును జాన్వీకపూర్‌కు మంగళవారం ప్రదానం చేయనుంది.
 
నిజానికి జాన్వీ కపూర్ నటించింది కేవలం ఒకే ఒక చిత్రం మాత్రమే. "దఢక్" చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన జాన్వీ కపూర్... ఈ చిత్రంలో మంచి నటననే ప్రదర్శించింది. దీంతో ఆమెకు మంచి మార్కులు పడటమేకాకుండా, అనేక మంది అభిమానులను కూడా సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో 'రైజింగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు'కు జాన్వీ కపూర్ ఎంపికైంది.
 
దీనిపై జాన్వీ కపూర్ మాట్లాడుతూ, ఈ ఏడాది 'దఢక్' చిత్రంతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చా. నార్వేలో ఉన్నవారితోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చూశారు. నార్వే ప్రజలు సోషల్‌మీడియా ద్వారా దఢక్ చిత్రానికి ప్రశంసలు, ఆశీస్సులు అందించారు. 
 
ఇలాంటి అరుదైన గుర్తింపు రావడం ఆశ్చర్యంగా, గొప్ప అనుభూతిని కలిగించేలా ఉంది. 'రైజింగ్ ఆఫ్ ది ఇయర్ టాలెంట్ అవార్డు' రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, ఇది ఎంతో సంతోషకరమైన విషయమని ఆమె వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments