Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుట్ట బొమ్మ పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేసిన సిమ్రాన్-video

Webdunia
శనివారం, 16 మే 2020 (12:26 IST)
దక్షిణాది సినీ ప్రేక్షకులను ఓ ఊపు ఊపిన నటి సిమ్రాన్. ఇటీవలే తను సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. త్వరలో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఇదిలావుంటే తాజాగా ఆమె ట్విట్టర్‌లో డ్యాన్స్ వీడియోను ఒకదాన్ని షేర్ చేసింది.

అది మామూలు డ్యాన్స్ వీడియో కాదు... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం అల వైకుంఠపురములో సాంగ్ 'బుట్టా బొమ్మా' సాంగ్. ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను సిమ్రాన్ పంచుకున్నారు.
 
"బుట్ట బొమ్మా" టిక్‌టాక్‌లో బ్లాక్‌బస్టర్‌గా మారింది. చాలా మంది టిక్‌టాక్ వినియోగదారులు ఈ పాటకు స్టెప్పులు వేస్తూ షేర్లు చేస్తున్నారు. ఇటీవలే పాపులర్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా తన భార్యతో కలిసి బుట్టబొమ్మకు స్టెప్పులేసిన వీడియోను షేర్ చేశారు.
 
కాగా 'అల వైకుంఠపురములో' చిత్రానికి దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ వహించగా ఇందులో పూజా హెగ్డే, టబు, జయరామ్, సుశాంత్, నవదీప్, నివేదా పెతురాజ్, మురళి శర్మ, సునీల్, సచిన్ ఖేడేకర్, హర్ష వర్ధన్ తదితరులు నటించారు. ఈ పాటను గాయకుడు అర్మాన్ మాలిక్ పాడగా ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూర్చారు. రామజోగయ్య శాస్త్రి 'బుట్ట బొమ్మా' సాహిత్యాన్ని రాశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సినిమా అవకాశం పేరుతో మహిళపై అత్యాచారం చేసిన అసిస్టెంట్ డైరెక్టర్

NTR: ఎన్టీఆర్ 29వ వర్ధంతి.. నివాళులు అర్పించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలయ్య (video)

పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు: పెండింగ్‌లో ఉద్యోగుల కేసుల సంగతేంటి?

IRCTC: కుంభమేళాకు ఐఎస్సార్టీసీటీ ప్రత్యేక రైలు- ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ నుంచి..?

కారులో భార్య, ఆమె పక్కనే ప్రియుడు, కారు బానెట్ పైన మొగుడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments