Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుసగా చేదు వార్తలే.. బాలీవుడ్‌కు ఏమైంది..? శిఖా మల్హోత్రాకు..?

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (13:41 IST)
Shikha Malhotra
బాలీవుడ్ చిత్ర సీమకు సంబంధించిన నటీనటులు వార్తల్లో నిలుస్తున్నారు. అదీ బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత మరీ ఎక్కువ. డ్రగ్స్ వ్యవహారంలో చాలామందితో విచారణ జరిగిన సంగతిని పక్కన బెడితే.. తాజాగా బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. నటి శిఖా మల్హోత్రా పక్షవాతానికి గురయ్యారు. 
 
నర్సింగ్ కోర్సు చేసిన శిఖా లాక్‌డౌన్ సమయంలో కరోనా రోగులకు ఆరు నెలల పాటు స్వచ్ఛందంగా సేవలందించారు. ఈ క్రమంలోనే అక్టోబరులో ఆమెకు కరోనా సోకింది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం నెగిటివ్ రావడంతో కొద్దిరోజుల క్రితమే ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు పక్షవాతం రావడంతో బాలీవుడ్ ఉలిక్కి పడింది. శిఖా మల్హోత్రా షారుఖ్‌ ఖాన్‌తో కలిసి 'ఫ్యాన్‌' సినిమాలో నటించారు. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం శిఖా మల్హోత్రా శరీరం కుడివైపు కాళ్లు, చేతులు తీవ్రంగా ప్రభావితం కావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. శిఖాకు నెల రోజుల క్రితం పక్షవాతం సోకడంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉండి క్రమంగా కోలుకున్నారు. ఆమె ఆరోగ్యం కుదుటపడిందని అనుకుంటున్న సమయంలోనే పక్షవాతం రావడం కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. 
 
'శిఖా మల్హోత్రాకు పక్షవాతం రావడంతో కుడివైపు శరీరం తీవ్రంగా ప్రభావితమైంది. ఆమెను విలేపార్లేలోని కూపర్ ఆసుపత్రిలో చేర్చాం' అని ఆమె మేనేజరు అశ్వని శుక్లా తెలిపారు. శిఖా ప్రస్తుతం చికిత్స పొందుతోందని, కనీసం మాట్లాడలేకపోతోందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు.. ఆధిక్యంలో బీజేపీ.. ట్రెండ్స్ మారితే?

మహారాష్ట్రలో తదుపరి సీఎం ఎవరు.. అప్పుడే మొదలైన చర్చ?

జార్ఖండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments