Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్లీల చిత్రాలు పోస్ట్ చేస్తున్నారు : నటి రంజిత ఆవేదన

Webdunia
ఆదివారం, 16 డిశెంబరు 2018 (16:38 IST)
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సాగుతున్న వివాదంపై సినీ నటి రంజిత ఆవేదన వ్యక్తం చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కొందరు మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం సబబు కాదన్నారు. పైగా, తాము సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా శబరిమల వెళ్ళడానికి వేచి చూస్తాం అని వ్యాఖ్యానిచారు. ఇదే పేరుతో ఓ సంఘం కూడా ఏర్పాటైంది. ఈ సంఘంలో నటి రంజిత ఒక సభ్యురాలు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, ఇటీవల ఒక భేటీలో శబరిమల ప్రాంతంలో ఒక వ్యక్తి ఒంటికి నిప్పంటించుకోవడం వల్ల అక్కడ పరిస్థితులు మళ్లీ సమస్యగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండాల్సిన ఆలయం వద్ద అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని, భక్తులకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో నిజమైన భక్తులకు స్వామి దర్శనం చేసుకోలేని పరిస్థితి అని పేర్కొన్నారు. 
 
ఆ మధ్య రెహానా ఫాతిమాను పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని ఆమె సమర్థించారు. దీంతో కొందరు మహిళలు.. ఒక స్త్రీ అయి ఉండి సాటి స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. మరి కొందరు శబరిమలకు వెళ్లే ముందు తన ఫేస్‌బుక్‌లో అశ్లీల చిత్రాలను పోస్ట్‌ చేస్తున్నారని, ఈ చర్యలు క్రిమినల్‌ కేసు కిందకు రావా? అంటూ నటి రంజిత శనివారం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేస్తూ వాపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments