Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో నమిత వివాహ లైట్ మ్యూజిక్ ఈవెంట్... ఎలాగుందో తెలుసా?

నమిత. అటు తెలుగు, ఇటు తమిళ భాషల్లో ప్రేక్షకులు బాగా పరిచయమున్న హీరోయిన్. ముద్దుగా, బొద్దుగా ఉండే నమితకు ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. వయస్సు పైబడిన నేపధ్యంలో ఇక నమిత వివాహం చేసుకోదేమోనని అనుకున్నారు. కాన

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (17:26 IST)
నమిత. అటు తెలుగు, ఇటు తమిళ భాషల్లో ప్రేక్షకులు బాగా పరిచయమున్న హీరోయిన్. ముద్దుగా, బొద్దుగా ఉండే నమితకు ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. వయస్సు పైబడిన నేపధ్యంలో ఇక నమిత వివాహం చేసుకోదేమోనని అనుకున్నారు. కానీ ఆమెకు తగ్గ జోడి దొరక్కపోవడంతో నమిత వెనక్కి తగ్గి వివాహం చేసుకోవడంలో ఆలస్యం చేశారు. అయితే తమిళ బిగ్ బాస్ షోలో పరిచయమైన హీరో, నిర్మాత వీరేంద్ర చౌదరితో ప్రేమాయణం నడిపిన నమిత చివరకు పెళ్ళి వరకు వచ్చింది. 
 
నిన్న తిరుపతిలోని ఒక ప్రైవేటు హోటల్లో ఎంతో ఆర్భాటంగా నమిత, వీరేంద్ర చౌదరి వివాహ లైట్ మ్యూజిక్ కార్యక్రమం జరిగింది కానీ ఎవరూ హాజరు కాలేదు. పేలవంగా కేవలం 20 మంది మాత్రమే ఈ కార్యక్రమానికి వచ్చారు. లైట్ మ్యూజిక్ కాస్త సైలెంట్ మ్యూజిక్‌ను తలపించింది. 
 
వీరేంద్ర చౌదరి బంధువులు 10 మంది, నమిత బంధువులు మరో 10మంది మాత్రమే వేడుకలో కనిపించారు. తమిళనాడు నుంచి అధికసంఖ్యలో నమిత ఫ్యాన్స్ వచ్చినా ఎవరినీ లోపలికి అనుమతించలేదు. దీంతో అభిమానులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అనుకున్న సమయంకన్నా ముందుగా మధ్యాహ్నమే లైట్ మ్యూజిక్ కార్యక్రమం కాస్త పూర్తయ్యింది. కాగా 24వ తేదీన ఇస్కాన్ ఆలయంలో నమిత వివాహం జరుగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments