Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిపై సదుద్దేశం లేదు.. అందుకే పెళ్ళికి అంగీకరించలేదు : నటి కౌసల్య

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (13:11 IST)
తనకు పెళ్లిపై సదుద్దేశం లేదని అందుకే తాను పెళ్లికి అంగీకరించలేదని సినీ నటి కౌసల్య అన్నారు. ఒకపుడు హీరోయిన్‌గా రాణించిన కౌసల్య.. ఇపుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను వివరించారు. తనకు పెళ్లిపై సదుద్దేశం లేదని, అందుకే పెళ్లి చేసుకోలేదని చెప్పారు. 
 
'పెళ్లి అనే అంశంపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. సరైన వ్యక్తి జీవితంలోకి అడుగు పెట్టినప్పుడు వైవాహిక బంధం తప్పకుండా అందంగా ఉంటుంది. పెళ్లిపై నాకు ఎన్నో ఆలోచనలు ఉండేవి. పెళ్లి అనే విషయానికి నేను సెట్ కానని మొదట్లో అనుకునేదాన్ని. నాకు సరైన వ్యక్తి దొరకడేమో అని భయపడేదాన్ని. ఓ దశలో సరైన బంధం కోసం ఎదురుచూశా. కానీ, అది నాకు సెట్ కాలేదు. తల్లిదండ్రులతోనే ఉండాలని నిర్ణయించుకున్నా. 
 
వాళ్లతో నాకు మంచి అనుబంధం ఉంది. అదేసమయంలో పెళ్లైతే అత్తమామలతో ఎలా ఉంటానోనని కంగారుపడ్డా. ఇలాంటి ఆలోచనలతో రిలేషన్, పెళ్లి అనే విషయాలకు కొంతకాలం పాటు దూరంగా ఉన్నా. కొన్నేళ్ల క్రితం నేను అనారోగ్యానికి గురయ్యా. బరువు బాగా పెరిగాను. అప్పట్లో నేను నటించిన కొన్ని సినిమాలు సరైన సంతృప్తిని అందించలేదు. దాంతో అన్నింటి నుంచి బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నా' అని ఆమె చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments