Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతఃపురంలో మహిళలకు సేవ చేసేవారు తెలుగు ప్రజలు : తమిళ నటి కస్తూరి

ఠాగూర్
సోమవారం, 4 నవంబరు 2024 (11:20 IST)
అక్కినేని నాగార్జున - కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో వచ్చిన "అన్నమయ్య" చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటి, తమిళనాడు బీజేపీ మహిళా నాయకురాలు కస్తూరి తెలుగు ప్రజల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజులు, మహరాజుల కాలంలో సేవకులుగా పని చేయడానికి తెలుగువారు తమిళనాడుకు వచ్చారంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 
 
ఆదివారం చెన్నై నగరంలో నిర్వహించిన బీజేపీ సభలో ప్రసంగించిన కస్తూరి ద్రావిడ సిద్ధాంత వాదులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే తెలుగు ప్రజలను కించపరిచేలా కామెంట్స్ చేశారు. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చారన్నారు. అలా వచ్చిన వాళ్లు ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. 
 
మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని ఎలా అంటున్నారు? ప్రస్తుత తమిళనాడు మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. ఇతరుల ఆస్తులు లూటీ చేయొద్దు. ఇతరుల భార్యలపై మోజుపడొద్దు. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దు అని బ్రాహ్మణులు చెబుతున్నారు. ఇలా మంచి చెబుతున్నారు కాబట్టే వారికి వ్యతిరేకంగా తమిళనాడులో ప్రచారం సాగుతోంది అంటూ కస్తూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులో కాకుండా తెలుగు రాష్ట్రాల్లో హట్ టాపిక్‌గా మారాయి 
 
అయితే కస్తూరి చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు సీఎం స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌లను ఉద్దేశించేనని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కరుణానిధి పూర్వీకులు తెలుగువారేనని ఎంజీఆర్ కాలం‌ నుంచి ఇది ప్రచారంలో ఉంది. ఇప్పుడు కస్తూరి కూడా ఇన్ డైరక్ట్‌గా తెలుగు వారి పేరుతో ఉధయనిధి‌కు కౌంటర్ ఇచ్చినా తెలుగు వారిని టార్గెట్‌గా మాట్లాడటం వివాదాస్పదం అయింది. 
 
కాగా, తమిళ చిత్రపరిశ్రమలో నటి కస్తూరికి ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా రావడం లేదు. చివరకు బుల్లితెర కార్యక్రమాల్లో కూడా ఆమెను న్యాయనిర్ణేతగా ఎంపిక చేయడం లేదు. దీంతో అవకాశాల కోసం గత నాలుగేళ్లుగా హైదరాబాద్ నగరంలో ఉంటున్నారు. కానీ, చెన్నైకు వచ్చిన ఆమె.. తెలుగు ప్రజలను కించపరిచేలా, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments