Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాషాయం కండువా కప్పుకున్న కరాటే కళ్యాణి

Webdunia
ఆదివారం, 15 ఆగస్టు 2021 (14:33 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీ నటి కరాటే కళ్యాణి. ఇపుడు రాజకీయ నాయకురాలిగా మారిపోయారు. ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో మరికొంతమంది సినీ నటులతో ఆమె ఆదివారం బీజేపీలో చేరారు. అలాగే, జల్పల్లి కౌన్సిలర్ యాదయ్యతో పాటు ప‌లు పార్టీల నేతలు కూడా బీజేపీలో చేరారు. వారంద‌రినీ రాష్ట్ర బీజేపీ నాయ‌కులు పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.
 
ఈ సంద‌ర్భంగా బీజేపీ నాయ‌కురాలు విజయశాంతి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పాల‌న‌ రాక్షసుల చేతుల్లోకి వెళ్లిందని మండిప‌డ్డారు. 
 
తెలంగాణ బీజేపీ చేతుల్లోకి వెళితేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. బీజేపీలో ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ నడ్డా వంటి ఎందరో సమర్థ‌వంత‌మైన నేత‌లు ఉన్నార‌ని చెప్పారు.
 
తెలంగాణ‌లో సంజయ్ వంటి నేత ఉన్నార‌ని ఆమె చెప్పారు. రాష్ట్ర‌ ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకునేందుకు ఆయ‌న‌  పాదయాత్ర చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు. ఆయ‌న‌ పాదయాత్ర విజ‌య‌వంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments