Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాక్ష్యాలను తారుమారు చేస్తున్న దిలీప్.. పాస్ పోర్ట్ ఇచ్చేయాలట..

ప్రముఖ సినీ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ ఖైదీగా 85 రోజుల పాటు జైలులో వున్న నిందితుడు, సినీ నటుడు దిలీప్.. అక్టోబర్ 3న కండిషన్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే దిలీప్ సాక్షులను ప్రభావితం చ

Webdunia
బుధవారం, 22 నవంబరు 2017 (15:42 IST)
ప్రముఖ సినీ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ ఖైదీగా 85 రోజుల పాటు జైలులో వున్న నిందితుడు, సినీ నటుడు దిలీప్.. అక్టోబర్ 3న కండిషన్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే దిలీప్ సాక్షులను ప్రభావితం చేసి.. సాక్ష్యాధారాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ.. సిట్ అంగమావి కోర్టుకు వెల్లడించింది. అంతేగాకుండా తన భార్య కావ్య మాధవన్ మాల్ ''లక్ష్య''లోని ఉద్యోగులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. 
 
ఇలా దిలీప్ సాక్ష్యాలను ప్రభావితం చేయడంతోనే ఇటీవల సాక్షి మాటమార్చాడని సిట్ అధికారులు అంగమాలి కోర్టుకు తెలిపారు. ఇంకా బెయిల్ నిబంధనల్లో భాగంగా కోర్టుకు సరెండర్ చేసిన పాస్ పోర్టును కూడా ఇవ్వాలని.. దుబాయ్‌లో తన వ్యాపార సంస్థను ప్రారంభించేందుకు వెళ్లాలని కోరుతూ కోర్టులో దిలీప్ పిటిషన్ దాఖలు చేశారు. సాక్షి మాట మార్చడంతో కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని దిలీప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవి రెండూ దిలీప్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘించడమేనని సిట్ అధికారులు కోర్టుకు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం