Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్లు ఈర్ష్యతో రగిలిపోతుంటారా.. ఉత్తి గ్యాస్ అన్న తమన్నా

హీరోయిన్ల మధ్య అందరూ భావిస్తున్నట్లుగా ఈర్షాద్వేషాలు, ఒకరి అవకాశాన్ని మరొకరు కొల్లగొట్టాలనే స్వార్థం ఉంటాయని బయట జరుగుతున్న ప్రచారం అంతా డొల్లేనని మిల్కీ బ్యూటీ తమన్నా చెబుతున్నారు.

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (05:45 IST)
హీరోయిన్ల మధ్య అందరూ భావిస్తున్నట్లుగా ఈర్షాద్వేషాలు, ఒకరి అవకాశాన్ని మరొకరు కొల్లగొట్టాలనే స్వార్థం ఉంటాయని బయట జరుగుతున్న ప్రచారం అంతా డొల్లేనని మిల్కీ బ్యూటీ తమన్నా చెబుతున్నారు. కథానాయికల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని, ఒకరిని చూసి మరొకరు ముఖం చిట్లించుకుంటారని, ఈర్షాధే్వషాలు ఎకు్కవేనని  రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి.అభిమానులు తారల మధ్య పోటీ ఉంటుందని  భావిస్తుంటారు. నిజానికి తెరవెనుక వాస్తవ పరిస్థితులు వేరు అన్నది తమన్నా అబిప్రాయం. తన తోటి హీరోయిన్లపై తన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే విందాం. 
 
కథానాయికలు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ కుశల ప్రశ్నలతో సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. చిత్రాలు విజయం సాధిస్తే అభినందించుకుంటారు. కష్ట సమయాల్లో  పరామర్శించుకుంటారు. కథానాయికల మధ్య సత్సంబంధాలు ఉంటాయి. పోటీ అన్నది మీడియా సృష్టే. 
 
నా వరకూ చెప్పాలంటే చాలా మంది కథానాయికలతో స్నేహం ఉంది. అందులో ప్రధాన స్నేహితురాలు అనుష్క. నేను ఆరంభ దశలో చిత్ర పరిశ్రమలో ఎవరూ తెలియక చాలా కష్టపడ్డాను. అప్పటికే  నటిగా అనుష్క నాకంటే సీనియర్‌. అయినా ఎలాంటి గర్వం చూపకుండా నాతో స్నేహంగా మెలిగారు. చిత్ర పరిశ్రమ గురించి, ఇక్కడ ఎవరితో ఎలా మసలుకోవాలన్న పలు విషయాలను చెప్పారు. ఒక నటి నిరంతరంగా ఒక కాస్ట్యూమ్ డిజైనర్‌ను నియమించుకోవాలన్న విషయాన్ని తెలియని నాకు అనుష్కనే చెప్పారు. ఇలా చాలా విషయాల్లో తను నాకు సాయం చేశారు. 
 
నటి కాజల్‌ అగర్వాల్‌ నాకు మంచి స్నేహితురాలే. మేమిద్దరం సినిమాలో సమానంగా పయనిస్తూ దశాబ్ద కాలంగా నటిస్తున్నాం. ఎలాంటి పాత్ర అయినా అందులో అద్బుతంగా నటించగల ప్రతిభాశాలి కాజల్‌. 
 
ఇక నా కళ్ల ముందు ప్రముఖ కథానాయకిగా ఎదిగిన నటి సమంత. తనతోనూ నాకు మంచి స్నేహబంధం ఉంది. సమంత ప్రతిభతో పాటు తెలివైన నటి. సినిమాల్లో  సంపాదించింది ఇతరులకు సాయం చేయాలన్న లక్ష్యంతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమంతను అభినందించాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది తమన్నా భాటియా.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments