Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోగా భయం పోయింది... అంత ఈజీకాదని తెలిసింది: సందీప్‌ కిషన్‌

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (20:56 IST)
'ప్రస్థానం'లో నెగెటివ్‌ షేడ్స్‌ పోషించిన సందీప్‌ కిషన్‌ ఆ తర్వాత 'వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌', 'బీరువా', 'టైగర్‌' వంటి చిత్రాల్లో హీరోగా నటించాడు. ఎప్పటికైనా నెగెటివ్‌ షేడ్స్‌ మంచి కథ దొరికితే చేస్తానని చెబుతున్న ఆయన తాజాగా 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రంలో నటించాడు. నిత్యమీనన్‌ కథానాయిక. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే సందీప్‌కిషన్‌ పుట్టినరోజు ఈ శనివారమే. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ...
 
సినిమా ప్రయాణం ఎలా వుంది? 
నేను సినీ ప్రస్తానం చేశాక.. దాదాపు ఏడాదిన్నర వరకు ఖాళీగా ఉన్నా.. హీరోగా చేయాలనుకున్న నాకు.. ఇక సినిమాలు రావేమో.. హీరోగా పనికిరానేమోనని భయపడ్డా. అప్పుడు చాలా టెన్షన్‌ ఫీలయ్యాను. ఆ తర్వాత వచ్చిన సినిమాలతో 'హమ్మయ్య!' అనిపించింది. దీంతో ఇప్పుడు నటుడుగా అవకాశాలు రావని భయంలేకుండా పోయింది. ఇందుకు కారణం.. 'వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌' సినిమానే. ఆ తర్వాత బిజీగా మారిపోయాను. 
 
ప్లాప్‌లు ఏం పాఠాలు నేర్పాయి? 
మొదట్లో చాలా టెన్షన్‌ పడేవాడ్ని. చాలా భయమేసేది. ఇంకో విషయం చెప్పాలి. సినిమారంగంలోకి రాకముందు.. ప్రతి సినిమా హిట్‌ కొట్టాలి. ఫెయిల్‌ కాకూడదని ఊహించుకునేవాడిని. కానీ వచ్చాక అది అంత ఈజీకాదని తెలిసింది. అందుకే.. ప్లాప్‌లో చేసిన తప్పులు చేయకుండా జాగ్రత్తపడుతుంటాను. 
 
ఈ సినిమాలో మీ పాత్ర ఏమిటి? 
చదువంటే ఇష్టం లేక కాలేజీని మధ్యలోనే వదిలేసే కుర్రాడిగా నటించా. చాలా తెలివైన వాడు. ఎదుటివారిని చదివే క్యారెక్టర్‌. ఎంతో ఫన్‌‌గా ఎనర్జిటిక్‌‌గా ఉంటాడు. 
 
ఈ కథలో మీకు నచ్చిందేమిటి? 
హైటెక్‌ సిటీ ఫ్లై ఓవర్‌ ట్రాఫిక్‌ మధ్య జరిగే కథ. ఈ పాయింట్‌ చెప్పగానే చాలా త్రిల్‌ ఫీలయ్యాను. ఇద్దరు ప్రేమికులు ఆ ట్రాఫిక్‌ జామ్‌ నుండి తమ సమస్యను దాటుకొని ఎలా బయటపడారనేదే స్టోరీ. ట్రాఫిక్‌ జామ్‌ అనేది సినిమాలో ప్రధాన పాయింట్‌. ఫ్లై ఓవర్‌ మీద సుమారుగా 60 శాతం షూటింగ్‌ జరుగుతుంది. రియలిస్టిక్‌ ఎమోషన్స్‌ను బేస్‌ చేసుకొని సినిమా చేశారు. స్క్రీన్‌ ప్లే సినిమాను పరుగెత్తిస్తుంది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తోనే సినిమాను రూపొందించాం. 
 
కొత్త దర్శకుడు రాజసింహ ఎలా చేశాడు? 
కొత్తవాడైనా రాజసింహ గొప్ప దర్శకుడు. ఆయన ఈ కథ నాకు 2012లో చెప్పారు. నాకు నచ్చి పక్కన పెట్టుకున్న రెండు కథలు 'వెంకటాద్రి ఎక్స్‌‌ప్రెస్'‌, ఒక్క అమ్మాయి తప్ప. కానీ ఇది చాలా కాంప్లికేటెడ్‌ ఫిలిం. ఆయన కొందరికి కథ చెబితే.. ఫ్లై ఓవర్‌ ట్రాఫిక్‌ జామ్‌పైనే కథేంటి? అని రిజక్ట్‌ చేశారట. అందుకే నేను నమ్మడానికి, ఆయన నన్ను నమ్మించడానికి ఈ మూడు సంవత్సరాల సమయం పట్టింది. చిత్రమేమంటే.. అది అటుఇటూ తిరిగి ఫైనల్‌గా నా దగ్గరకే వచ్చింది. 
 
నిత్య.. మీకంటే ఎత్తు తక్కువగదా? 
అది సినిమాలో కన్పించదు. మా జంట స్క్రీన్‌ మీద బావుంటుంది. పొగుడు విషయంలో మాకు ఎలాంటి సమస్యలు రాలేదు. సరదాగా సెట్‌లో మాత్రం ఒకరినొకరం కామెంట్‌ చేసుకునేవాళ్ళం. నిత్య ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం కూడా కథే. 
 
సి.జి. వర్క్‌ ఎలా ఉంది? 
ఇది పక్కా కమర్షియల్‌ సినిమా. అయినా.. ఒక కొత్త పాయింట్‌తో కథ డ్రైవ్‌ అవుతూ ఉంటుంది. పాటలు, ఫైట్స్‌ చాలా బావుంటాయి. పెద్ద స్కేల్‌లో సినిమా ఉంటుంది. నిజానికి ఫ్లై ఓవర్‌ మీద 60 శాతం షూటింగ్‌ అంటే వర్కవుట్‌ కాదు. అన్నపూర్ణలో సెట్‌ వేసి సీన్స్‌ తీశాం. వారం రోజులు మాత్రం ఫ్లై ఓవర్‌ మీదే షూట్‌ చేశాం. సి.జి వర్క్‌ ఎక్కువ ఉంటుంది. కానీ అలా అనిపించకుండా ఉండే తీయడానికి ప్రయత్నించాం. 
 
నెగెటివ్‌ రోల్స్‌ చేయబోతున్నారా? 
నేను గతంలో చెప్పినట్లు నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలు చేయాలని వుంది. కానీ అందుకు కథలు వస్తే ఖచ్చితంగా చేస్తాను. హీరో, విలన్‌ అనే వేరియేషన్‌ చూడను. 
 
కృష్ణవంశీతో పనిచేయడం ఎలా అనిపిస్తుంది? 
కొత్తలో కృష్ణవంశీ గారితో పని చేయాలని అనుకునేవాడిని. ఇన్నిరోజులకి నాకు అలాంటి గొప్ప అవకాశం వచ్చింది. ఆయన దగ్గర నుండి ఎంతో నేర్చుకోవచ్చు. ఆయనకు తెలియని విషయం అంటూ.. ఉండదు. ఇంకా హీరోయిన్‌ ఫైనల్‌కాలేదు. నందితోపాటు పలువుర్ని పరిశీలిస్తున్నారు. త్వరలో అన్ని వివరాలు తెలియజేస్తారు. 
 
తదుపరి చిత్రాలు..
కృష్ణవంశీగారితో 'నక్షత్రం', తమిళంలో నేను, లావణ్య త్రిపాఠి కలిసి 'మయవన్‌' అనే సినిమాలో నటిస్తున్నాం. అలానే తమిళంలో పోటెన్షియల్‌ స్టూడియోస్‌ వారి బ్యానర్‌‌లో మరో సినిమాలో నటిస్తున్నాను అని చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కేకులో ఉంగరాన్ని దాచిపెట్టిన ప్రియుడు.. కొరికి తినేసిన ప్రియురాలు.. ఏమైంది?

ఎండాకాలం రాకముందే తెలంగాణాలో వేసవి ఎండలు..!!

పోలింగ్‌కు కొన్ని గంటల ముందు.. ఢిల్లీ ఏం జరిగిందో తెలుసా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు..

అవసరమైతే ఎంపీలతో చేతులు కలుపుతాం.. పోలవరం కోసం పోరాడతాం.. మిథున్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments