Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు.. ఫస్ట్ బైక్ పవన్ కళ్యాణ్ గిఫ్ట్..

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2022 (10:55 IST)
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రేయ్ అనే సినిమా ద్వారా సాయిధరమ్ తేజ్ సినిమా చేశారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ 2013వ సంవత్సరంలో పూర్తయినా సరే ఆర్థిక ఇబ్బందులతో సినిమా 2017 వరకు విడుదల కాలేదు.

ఆయన తొలి సినిమా పిల్ల నువ్వు లేని జీవితం. ఆయన మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఆపై సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి సినిమాలతో మంచి హీరోగా నిలబడ్డాడు.

తర్వాత తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటలిజెంట్, తేజ్ ఐ లవ్ యు ఇలా వరుస డిజాస్టర్ ఫలితాలు అందుకున్నా చిత్రలహరి సినిమాతో మళ్ళీ హిట్ అందుకున్నాడు. తర్వాత ప్రతిరోజూ పండుగ సినిమాతో పర్వాలేదనిపించుకున్నా సోలో బతుకే సో బెటరూ రిపబ్లిక్ సినిమాలతో ఇబ్బంది పడ్డాడు. అయితే రిపబ్లిక్ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందే రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

సాయిధరమ్ తేజ్ కి ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. సాయిధరమ్ తేజ లైఫ్‌లో ఫస్ట్ బైక్ పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఇచ్చిందే. సాయిధరమ్ తేజ్ రూమ్‌లోకి ఎంటర్ అయ్యే ముందు ఆ గదికి ఒక వార్నింగ్ పోస్టర్ ఉంటుంది. తన మేనమామల లాగానే సాయిధరమ్ తేజ్ కూడా ఆంజనేయస్వామికి వీరభక్తుడు. ఇక సాయిధరమ్ తేజ్‌కి పప్పు ఆమ్లెట్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. ఇకపై సాయిధరమ్ తేజ్‌కు సూపర్ ఆఫర్స్ రావాలని ఆయన పుట్టిన రోజు సందర్భంగా మనమూ ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments