Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

మురళి
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (15:13 IST)
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు, టాలీవుడ్ హీరో సాయి రామ్ శంకర్ నటించిన కొత్త సినిమా 'ఒక పథకం ప్రకారం'. మలయాళ డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించారు. గార్లపాటి రమేష్, వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ఇందులో సాయి రామ్ శంకర్ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా రిలీజ్ సందర్భంగా ఇచ్చిన తాజాగా ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు సాయిరాం శంకర్. ఆ విశేషాలు తెలుసుకోండి
 
ప్రశ్న : 'విలన్ ఎవరో ఇంటర్వెల్ కు చెబితే రూ.10,000 పట్టుకెళ్ళండి', 'పట్టుకుంటే 10 వేలు' అంటున్నారు. అసలు ఈ ఐడియా ఎవరిది? రెస్పాన్స్ ఎలా ఉంది? దీనికి ముందు ఇంకేమైనా ఆలోచించారా? 
 
సాయి రామ్ శంకర్ : రెస్పాన్స్ అయితే అద్భుతంగా ఉంది. సినిమా పేరు, రిలీజ్ అవుతుందన్న విషయం తెలియడానికి ఇది బాగా ఉపయోగపడింది. మొదటి నుంచి ఇదొక్కటే అనుకున్నాం. సినిమా చూశాక మా యూనిట్‌లో కీలక సభ్యులు 'పట్టుకుంటే పదివేలు' అని చెప్పడంతో దీన్నే ఫిక్స్ అయ్యాము. 
 
ప్రశ్న : 'ఒక పథకం ప్రకారం' అంటున్నారు... టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? 
సాయి రామ్ శంకర్ : 'ఒక పథకం ప్రకారం' అంటే 80 శాతం క్రైమ్ జానర్ కథలకు వాడతాం. ఈ సినిమాలో ఉండే ప్రతి పాత్రకు ఎవరి ప్లానింగ్ వారికి ఉంటుంది. కాబట్టి 'ఒక పథకం ప్రకారం' అనే టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాం. 
 
ప్రశ్న : దర్శకుడికి ఇదివరకే ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. ఆయన ఎక్స్‌పీరియన్స్ ఈ సినిమాకు ఎంత వరకు ఉపయోగపడుతుంది? 
సాయి రామ్ శంకర్ : ఆయన 17 ఏళ్లకే డైరెక్టర్ అయ్యారు. ఆయన నా ఫస్ట్ మూవీ తర్వాత నుంచి నా ఫ్రెండ్. మేం 2005 నుంచి 'చేద్దాం చేద్దాం' అనుకున్నాం. అన్నిటి మీద అవగాహన ఉన్న మంచి టెక్నీషియన్. ఆయన దర్శకనిర్మాతగా ఫహద్ ఫాజిల్ తో రెండు సినిమాలు నిర్మించారు. తెలుగులో అలాగే దర్శక నిర్మాతగా సినిమాలు చేద్దామని చెప్పారు. మా ఇద్దరికీ ఉన్న కామన్ ఫ్రెండ్ వినీత్ ఉన్నారు. వీళ్లిద్దరూ కలిసి తెలుగులో చేద్దాం అనుకున్నపుడు నా పేరును అనుకున్నారు. 
 
ప్రశ్న : సముద్రఖని గారితో వర్క్ చేశారు కదా. ఏం నేర్చుకున్నారు? 
సాయి రామ్ శంకర్ : ఆయన ఆల్రెడీ సక్సెస్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, నటుడు. డైరెక్టర్ కి ఏం కావాలో అదే చేస్తారాయన.
 
ప్రశ్న : పూరి జగన్నాథ్ ట్రైలర్ చూశారా? ఆయన రియాక్షన్ ఏంటి? 
సాయి రామ్ శంకర్: అన్నయ్య ట్రైలర్ చూశారు. కొత్తగా ఉందని అన్నారు. అలాగే పట్టుకుంటే రూ. 10,000 గురించి కూడా చెప్పాను. 
 
ప్రశ్న : ఈ సినిమాలో మీ పాత్ర ఏంటి? 
సాయి రామ్ శంకర్ : మూవీ 50 సెంటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇందులో నా పాత్ర క్రిమినల్ లాయర్. నెమ్మదిగా నా క్యారెక్టర్ లో ఒక్కో షేడ్ బయట పడుతుంది. క్రిమినలా లేకపోతే క్రిమినల్ లాయరా అనిపించేలా ఉంటుంది. అయితే ఈ సినిమాలో నా పాత్ర కోసం వన్ మంత్ ట్రైనింగ్, వర్క్ షాప్స్ కూడా చేశాను. 
 
ప్రశ్న : సినిమాలో యాక్షన్ కి స్కోప్ ఉందా? 
సాయి రామ్ శంకర్ : ఆయన మలయాళ డైరెక్టర్ అయినప్పటికీ తెలుగు సినిమాలు, ఇక్కడి స్టైల్ బాగా ఇష్టం. 'మలయాళంలో ఓ పాయింట్ పట్టుకుని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అలా కుదరదు, కష్టం' అంటారు డైరెక్టర్ విజయన్. కాబట్టి తెలుగు ఆడియన్స్ తగ్గట్టుగా ఫైట్ సీన్స్ ని, సాంగ్స్ ను డిజైన్ చేశారు. తమిళ ఫైట్ మాస్టర్ ఢిల్లీ బాబు ఫైట్స్ డిజైన్ చేశారు.  
 
ప్రశ్న : సినిమా అంతా క్రైమ్ జానర్ లో సాగుతుందా? లవ్ స్టోరీ కూడా ఉంటుందా? 
సాయి రామ్ శంకర్ : ఇది లవ్ స్టోరీ బెస్ట్ క్రైమ్ మూవీ. 
 
ప్రశ్న : షూటింగ్ చేసేటప్పుడు ఏదైనా మర్చిపోలేని అనుభవం? 
సాయి రామ్ శంకర్ : షూటింగ్ కోసం 25 డాగ్స్ తెచ్చాము. ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ ఏకంగా 4 రోజులు చేశారు. ఆ టైంలో డాగ్ పైకి బయటకు రావడంతో, గ్రిల్ ఎక్కేశాను. లక్కీగా ఎస్కేప్ అయ్యాను. ఆ ఫైట్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక క్లైమాక్స్ సీన్ తీసి, సరిపోట్లేదని మళ్లీ ఎక్స్టెండెడ్ వెర్షన్ తీశారు డైరెక్టర్. ఏడెనిమిది రోజులు క్లైమాక్స్ కోసమే షూటింగ్ చేశాం. 
 
ప్రశ్న : ఈ మూవీ తర్వాత సాయి రామ్ శంకర్ కంటిన్యూగా సినిమాలు చేస్తారా? 
సాయి రామ్ శంకర్ : నాకు ఈ సినిమా మీద గట్టి నమ్మకం ఉంది. మధ్యలో ఫెయిల్యూర్ వచ్చినప్పటికీ, నాతో సినిమాలు చేయడానికి నిర్మాతలు వస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అవుతుందని హోప్ ఉంది. 
 
ప్రశ్న : హీరోగా నటిస్తారా? లేదంటే ఇతర క్యారెక్టర్స్ కూడా చేస్తారా? 
సాయి రామ్ శంకర్ : ఏదైనా చేస్తాను. నా క్యారెక్టర్ బాగుంటే ఎలాంటి రోల్ అయినా చేస్తాను.
 
ప్రశ్న : తెలుగు సినిమాల్లో హిందీ యాక్టర్స్ ఎక్కువగా ఉంటున్నారు. తెలుగు యాక్టర్స్ నటించడానికి ముందుకు రావట్లేదని అంటున్నారు. 
సాయి రామ్ శంకర్ : నేను ఆల్రెడీ 'నేనింతే' సినిమాలో చేశాను. నాకూ అవకాశాలు వచ్చాయి. కానీ చేయడం కుదరలేదు. 
 
ప్రశ్న : ఈ సినిమాకు, ఇంతకు ముందు చేసిన సినిమాలకు మధ్య తేడా ఏంటి? 
సాయి రామ్ శంకర్ : గతంలో ఇలాంటి ఇలాంటి సస్పెన్స్ జానర్ సినిమా, ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ నేను చేయలేదు. నెల ట్రైనింగ్ తర్వాత రియాలిస్టిక్‌గా చేశామన్న సంతృప్తి లభించింది. 
 
ప్రశ్న : తెలుగులో మాత్రమే విడుదల చేస్తున్నారా? మలయాళంలో కూడా రిలీజ్ అవుతుందా? 
సాయి రామ్ శంకర్ : ఇప్పటికి తెలుగులో మాత్రమే. నెక్స్ట్ ఇతర భాషల్లో ప్లాన్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజీవ్ గారు ఇండియన్ టాప్ కెమెరామన్లలో ఒకరు. అలాగే మలయాళంలో రెండు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు కూడా నేర్చుకున్నారు. 
 
ప్రశ్న : 'ఒక పథకం ప్రకారం' విడుదల రోజు 'తండేల్' కూడా రిలీజ్ కాబోతోంది. మీరేం అనుకుంటున్నారు? 
సాయి రామ్ శంకర్ : పోటీ ఏముంది? మేము 'తండేల్'తో పాటు రిలీజ్ చేయట్లేదు. 'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం.
 
ప్రశ్న : ఇటీవలకాలంలో వచ్చిన సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లలో ఏదంటే ఇష్టం?
సాయి రామ్ శంకర్ : దృశ్యం. కథ చాలా బాగుంటుంది. మైండ్‌లో నుంచి పోవట్లేదు. 
 
ప్రశ్న : వెబ్ సిరీస్‌లకు బాగా డిమాండ్ పెరిగింది. మీరు ఏమన్నా చేస్తున్నారా? 
సాయి రామ్ శంకర్ : ఓ మైథలాజికల్ సిరీస్ చేస్తున్నాం. అందులో 60 ఏళ్ల ఓల్డ్ రోల్ నాది. ఇప్పుడు చేస్తున్న సినిమాల లిస్ట్ లో 'రీసౌండ్' ఉంది. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagitial: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ మృతి.. బైకర్ కూడా..?

ఈ శ్వేతవర్ణపు జింకను చూస్తే అదృష్టమేనట! (Video)

కారు డ్రైవ్ చేస్తూ అనంతలోకాలకు చేరుకున్న ఎస్ఐ

Biryani-Chicken Fry కేరళ అంగన్‌వాడీల్లో ఉప్మా వద్దు... బిర్యానీ, చికెన్ ఫ్రై ఇస్తే బాగుండు.. బాలుడి వీడియో వైరల్ (video)

టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి స్నాక్స్.. సాయంత్రం 6 రకాలు.. రోజుకో రకం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments