Webdunia - Bharat's app for daily news and videos

Install App

భరత్ డ్రగ్స్ తీసుకుంటాడు.. అందుకేవాడు.. సిట్ ప్రశ్నకు రవితేజ ఆన్సర్

తన సోదరుడు భరత్ రాజుకు మత్తుమందు తీసుకునే అలవాటు ఉందనీ, అదీ కూడా గంజాయి తాగే అలవాటు ఉండొచ్చేమో కానీ కొకైన్ వంటి మత్తు పదార్థాల జోలికి ఎప్పుడూ పోలేదని టాలీవుడ్ హీరో రవితేజ చెప్పుకొచ్చాడు.

Webdunia
శనివారం, 29 జులై 2017 (09:51 IST)
తన సోదరుడు భరత్ రాజుకు మత్తుమందు తీసుకునే అలవాటు ఉందనీ, అదీ కూడా గంజాయి తాగే అలవాటు ఉండొచ్చేమో కానీ కొకైన్ వంటి మత్తు పదార్థాల జోలికి ఎప్పుడూ పోలేదని టాలీవుడ్ హీరో రవితేజ చెప్పుకొచ్చాడు. హైదరాబాద్‌లో వెలుగు చూసిన మత్తుదందా విచారణలో భాగంగా ఆయన శుక్రవారం సిట్ దర్యాప్తు బృందం అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా సిట్ అధికారులు అడిగిన ప్రశ్నకు సమాధానాలిచ్చారు.
 
తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని చెప్పాడు. కానీ, తన సోదరుడు భరత్‌కు డ్రగ్స్ అలవాటుపై స్పందిస్తూ.. గంజాయి తాగే అలవాటు ఉండొచ్చేమో కానీ కొకైన్ వంటి మత్తు పదార్థాల జోలికి ఎప్పుడూ పోలేదని చెప్పాడు. అంతేకాకుండా, తాను డ్రగ్స్ కోసమే బ్యాంకాక్ వెళ్తున్నట్టు వస్తున్న వార్తలు సరికావన్నారు. ఆ ప్రచారంలో నిజం లేదని, క్రియేటివిటీ, చక్కని ఆలోచనల కోసమే బ్యాంకాక్, గోవాలాంటి ప్రాంతాలకు వెళ్తుంటామన్నారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు కానీ, ఇతర చెడు అలవాట్లు కానీ లేవని తేల్చి చెప్పాడు. 
 
డ్రగ్స్ కేసులో నిందితులైన జీషన్, కెల్విన్‌‌ల ఫోన్ కాల్ డేటాలో మీ ఫోన్ నంబరు ఎందుకు ఉందన్న ప్రశ్నకు.. వారెవరో తనకు తెలియదని, వారి కాల్‌లిస్ట్‌లో తన నంబరు ఉండడం తప్పెలా అవుతుందన్నారు. సినిమాలను మరింత బాగా తీయడానికి వివిధ రకాల లొకేషన్స్‌కు వెళ్తుంటామని, కొన్ని ప్రదేశాల్లో అద్భుతమైన ఆలోచనలు వస్తుంటాయని, అందుకోసమే ఆయా ప్రాంతాలకు వెళ్తామని స్పష్టం చేశాడు. 
 
షూటింగ్ సమయంలో యూనిట్ సభ్యులందరూ కలిసి చిన్నచిన్న పార్టీలు చేసుకోవడం పరిపాటేనని, ఇందులో తప్పేముందని ఆయన చెప్పుకొచ్చాడు. దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి చార్మి, ముమైత్‌ఖాన్‌లకు డ్రగ్స్ అలవాటుందా? అన్న ప్రశ్నకు లేదని ముక్తసరిగా జవాబు చెప్పాడు. కాగా, విచారణలో భాగంగా రవితేజను మొత్తం 100 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హిందూ - ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ కుట్ర : రాహుల్ గాంధీ

ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ.. పార్లమెంట్ సమావేశాల మధ్య...?

'ఆర్ఆర్ఆర్‌'పై థర్డ్ డిగ్రీ ప్రయోగం... కటకటాల వెనక్కి సీఐడీ మాజీ ఏఎస్పీ

ఆటో నడుస్తుండగానే రిపీర్ చేశాడు.. వీడియో వైరల్ (video)

జగన్ - అదానీల విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి : వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments