Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు మెట్లెక్కిన సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ సతీమణి.. ఎందుకు?

"మా" అధ్యక్షుడు, టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ సతీమణి విజయ చాముండేశ్వరి శనివారం కోర్టు మెట్లెక్కారు. ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె కోర్టుకు రావడం వెనుక ఓ చెక్ బౌన్స్ కేసు కావడం గ

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2017 (17:02 IST)
"మా" అధ్యక్షుడు, టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ సతీమణి విజయ చాముండేశ్వరి శనివారం కోర్టు మెట్లెక్కారు. ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె కోర్టుకు రావడం వెనుక ఓ చెక్ బౌన్స్ కేసు కావడం గమనార్హం. 
 
కడపకు చెందిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, బిజినెస్‌మేన్‌ జయభరత్ రెడ్డి కేసుపెట్టాడు. గతంలో జయభరత్ రెడ్డి దగ్గర విజయ రూ.25 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ అప్పును తిరిగి చెల్లించే నిమిత్తం 2016లో ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో ఆమెపై జయభరత్ రెడ్డి చెక్ బౌన్స్ కేసు పెట్టారు. 
 
ఈ కేసు విచారణ నిమిత్తం ఆమె కోర్టుకు హాజరయ్యారు. అయితే, కేసు విచారణని న్యాయస్థానం ఈ నెల 21కి వాయిదా వేసింది. వరుస సినిమాలతో బిజీగా ఉండే రాజేంద్ర ప్రసాద్ సతీమణి చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు రావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

వెలుగు చూడాల్సిన జగన్ జల్సా ప్యాలెస్ రహస్యాలు చాలా ఉన్నాయ్... : మంత్రి నారా లోకేశ్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments