Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కార్తికేయ 2'కి అంతా సిద్ధం అంటోన్న నిఖిల్

నిఖిల్ - చందు మొండేటి కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం కార్తికేయ‌. ఈ చిత్రం ఎంత‌గా ఆక‌ట్టుకుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. నిఖిల్ కెరీర్లో మంచి హిట్ మూవీగా నిలిచిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ చేయ‌నున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూ

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (17:01 IST)
నిఖిల్ - చందు మొండేటి కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం కార్తికేయ‌. ఈ చిత్రం ఎంత‌గా ఆక‌ట్టుకుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. నిఖిల్  కెరీర్లో మంచి హిట్ మూవీగా నిలిచిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ చేయ‌నున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. కానీ… ఎప్పుడు అనేది ఇప్ప‌టివ‌ర‌కు అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌లేదు. ఇదిలాఉంటే… నిఖిల్ న‌టించిన తాజా చిత్రం కిరాక్ పార్టీ. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన నిఖిల్ కార్తికేయ 2 గురించి క్లారిటీ ఇచ్చారు.
 
ఇంత‌కీ విష‌యం ఏమిటంటే… కార్తికేయ 2కి అంతా సిద్ధం అని చెప్పాడు. ఇందులో కూడా నిఖిల్, స్వాతి క‌లిసి న‌టించ‌నున్నార‌ట‌. డైరెక్ట‌ర్ చందు మొండేటి ఆల్రెడీ స్ర్కిప్ట్ కంప్లీట్ చేసాడ‌ని… ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ మే నెల నుంచి ప్రారంభించ‌నున్నార‌ని తెలియ‌చేసాడు నిఖిల్. టి.ఎన్ సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో చేయాల్సిన క‌నిత‌న్ తెలుగు రీమేక్ పూర్త‌యిన త‌ర్వాత కార్తికేయ 2 షూటింగ్ లో పాల్గొంటాన‌ని చెప్పాడు. 
 
మ‌రోవైపు చందు మొండేటి నాగ‌చైత‌న్య‌తో తెర‌కెక్కిస్తోన్న స‌వ్య‌సాచి చిత్రం ఈ నెలాఖ‌రుకు షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. జూన్ 14న రిలీజ్‌కి రెడీ చేసారు. సో.. స‌వ్య‌సాచి కంప్లీట్ చేసి చందు కార్తికేయ 2 స్టార్ట్ చేయ‌నున్నాడు. మ‌రి… కార్తికేయ చిత్రంలానే కార్తికేయ 2 కూడా స‌క్స‌స్ సాధిస్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

గెస్ట్ హౌసుల్లో అమ్మాయిలతో కొండా మురళి ఎంజాయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ (Video)

ఇదేం రిపోర్టింగ్ బ్రో, ఫెంగల్ తుపాను గాలుల్లో గొడుగు ఎగిరిపోతున్నా మైక్ పట్టుకుని...(Video)

పెళ్లయ్యాక మీరు చేసేది అదే కదా: విద్యార్థినిలపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments