Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నిఖిల్ నటించిన ‘కేశవ’ ... మే 12న రిలీజ్

హిట్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు యంగ్‌ హీరో నిఖిల్‌. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘సూర్య వర్సెస్‌ సూర్య’, ‘కార్తికేయ’ ఇలా గత మూడేళ్లుగా ఆయన నటించిన సినిమాలన్నీ హిట్టే. ఈ జైత్రయాత్ర ‘స్వామి రార

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (16:32 IST)
హిట్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు యంగ్‌ హీరో నిఖిల్‌. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘సూర్య వర్సెస్‌ సూర్య’, ‘కార్తికేయ’ ఇలా గత మూడేళ్లుగా ఆయన నటించిన సినిమాలన్నీ హిట్టే. ఈ జైత్రయాత్ర ‘స్వామి రారా’ నుంచి మొదలైంది. నిఖిల్‌ సూపర్‌హిట్‌ ఇన్నింగ్స్‌కి స్ట్రాంగ్‌ పునాది వేసిన దర్శకుడు సుధీర్‌వర్మ. ‘స్వామి రారా’ తర్వాత నిఖిల్, సుధీర్‌వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘కేశవ’. తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు డిస్ట్రిబ్యూషన్‌ చేసిన శ్రీ అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత అభిషేక్‌ నామా నిర్మాత. ఇందులో ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ రితూవర్మ హీరోయిన్‌గా, బాలీవుడ్‌ బ్యూటీ ఇషా కొప్పికర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. మంగళవారం డబ్బింగ్‌ కార్యక్రమాలు మొదలయ్యాయి.
 
ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్‌ నామా మాట్లాడుతూ ‘‘ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌‌లుక్‌ పోస్టర్లకు అద్భుతమైన స్పందన లభించింది. పోస్టర్లు ఎంత కొత్తగా ఉన్నాయో... సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకూ జరిగిన షూటింగ్‌తో 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ రోజు డబ్బింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించింది. మరో పది రోజులు షూటింగ్‌ చేస్తే సినిమా మొత్తం పూర్తవుతుంది. చివరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరగనుంది. 
 
‘స్వామి రారా’ తరహాలో ఈ ‘కేశవ’ కూడా టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేస్తుంది. నిఖిల్ ‌- సుధీర్‌వర్మ కాంబినేషన్, డిస్ట్రిబ్యూషన్‌లో మా సంస్థకున్న మంచి పేరు దృష్ట్యా వ్యాపారపరంగా మంచి క్రేజ్‌ వచ్చింది. నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను ‘ఏసియన్‌ ఫిల్మ్స్‌’ సునీల్‌ నారంగ్‌ ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నారు. మిగతా ఏరియాల నుంచి కూడా ఫ్యాన్సీ రేట్లు ఆఫర్‌ చేస్తున్నారు. ఈ వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. మే 12న విడుదల చేయాలనేది మా ప్లాన్‌’’ అన్నారు.
 
హీరో నిఖిల్‌ మాట్లాడుతూ.. ‘‘సుధీర్‌వర్మ, నేనూ మంచి స్నేహితులం. ‘స్వామి రారా’తో మా ఇద్దరి కెరీర్‌ కొత్త టర్న్‌ తీసుకుంది. ఆ సినిమా తరహాలో ‘కేశవ’ కూడా సూపర్‌ హిట్టవుతుంది. సుధీర్‌వర్మ టేకింగ్‌ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. నా క్యారెక్టర్‌ చాలా కొత్తగా డిజైన్‌ చేశాడు’’ అన్నారు.
 
దర్శకుడు సుధీర్‌ వర్మ మాట్లాడుతూ... ‘‘పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే సరికొత్త కథతో తెరకెక్కుతోన్న సినిమా ఇది. నిఖిల్, రితూ వర్మ, ఇషా కొప్పికర్‌ క్యారెక్టరైజేషన్‌లు చాలా కొత్తగా ఉంటాయి’’ అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడతో కొడుకుని కంటాను.. ఆయన లేక నేను లేను.. బయోపిక్ తీస్తాం.. దివ్వెల మాధురి (video)

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments