Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగో పెళ్లికి సిద్ధమైన తెలుగు హీరో.. మూడో భార్యకు ఇచ్చిన భరణం ఎంత?

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (09:13 IST)
టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్ నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాడు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న నటి పవిత్రా లోకేష్‌తో కలిసి ఏడు అడుగులు నడువనున్నారు. ఈ విషయాన్ని వారిద్దరూ కొత్త సంవత్సరం రోజున అధికారికంగా వెల్లడించారు. 
 
నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వారిద్దరూ ముద్దులు పెట్టుకుంటూ సన్నిహితంగా ఉన్న వీడియోను రిలీజ్ చేసి, తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టు నిర్ధారించారు. ఇది నరేష్‌కు నాలుగో పెళ్లి కాగా, నటి పవిత్రా లోకేష్‌కు ఇది మూడో పెళ్లి. ఇపుడు వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నారు. 
 
మరోవైపు, నరేష్ మూడో భార్య సంగతేంటి అన్నదే ఇపుడు చర్చనీయాంశంగా మారింది. మొన్నటివరకు తన భర్త కోసం పోరాటం చేసిన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.. ఇపుడు ఉన్నట్టుండి సైలెంట్‌ అయిపోయారు. అంటే, ఆమెకు భారీ మొత్తంలోనే నరేష్ భరణం చెల్లించివుంటారని కోలీవుడ్ వర్గాల సమాచారం. 
 
ఈ చెల్లించిన మొత్తం ఎంత అన్నదే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు.. మూడో భార్యకు నరేష్ ఏకంగా రూ.5 కోట్ల మేరకు భరణం చెల్లించినట్టు సమాచారం. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, న్యాయవాదుల సమక్షంలో ఈ సెటిల్మెంట్ జరిగినట్టు వికికిడి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments