Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగరంగ వైభవంగా నటుడు నెపోలియన్ కుమారుడు వివాహం

ఠాగూర్
శుక్రవారం, 8 నవంబరు 2024 (17:41 IST)
తమిళ సినీ నటుడు, డీఎంకే మాజీ ఎంపీ నెపోలియన్ కుమారుడు ధనూష్ వివాహం అంగరంగ వైభవంగా జపాన్‌ రాజధాని టోక్యోలో నిర్వహించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను నటుడు నెపోలియన్ కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. 
 
కాగా, నెపోలియన్‌కు ధనూష్, కునాల్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇందులో నెపోలియన్ పెద్ద కుమారుడు ధనూష్‌కు చిన్నప్పటి నుంచి మస్కులర్ డిస్ట్రోఫీ అనే అరుదైన వ్యాధి ఉంది. ఒకానొక దశలో వ్యాధి తీవ్రమై ధనూష్‌కి పదేళ్లకు పైగా నడవలేని పరిస్థితి ఏర్పడింది. 
 
ఆ తర్వాత సిద్ధ వైద్యం ద్వారా వైద్యం చేస్తున్న నెపోలియన్.. కొడుకుకు కావాల్సిన వైద్య సదుపాయాలు అమెరికాలోనే ఉండడంతో కుటుంబంతో సహా అమెరికా వెళ్లి స్థిరపడ్డాడు. కొన్నేళ్ల క్రితం యూట్యూబర్‌ ఇర్ఫాన్‌ నెపోలియన్‌ ఇంటికి వెళ్లినప్పుడు నెపోలియన్‌కి తన కొడుకుపై ఉన్న ప్రేమ ఏ స్థాయిలో ఉందో వెలుగులోకి వచ్చింది.
 
నెపోలియన్ కొడుకు ధనుష్ ఇర్ఫాన్‌కి వీరాభిమాని కాబట్టి, అతన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఇర్ఫాన్ అతని ఇంటికి వెళ్లి అమెరికాలో తన కుమారుడి కోసం నెపోలియన్ కట్టించిన ప్యాలెస్ వీడియోను విడుదల చేశాడు. ఈ వీడియో చూసిన చాలా మంది ఓ తండ్రికి కొడుకుపై ఇంత ప్రేమ ఉంటుందా ఆశ్చర్యపోయారు.
 
ఎందుకంటే నెపోలియన్ ఆ ఇంట్లో కొడుకుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చాడు. నెపోలియన్ తన కొడుకు పెళ్లిని అంబానీ కంటే ఎక్కువగా జపాన్‌లో నిర్వహించాడు. నెపోలియన్ కొడుకు ధనుష్ జపాన్ వెళ్లాలని కలలుకన్నాడు. ఆ కలను నిజం చేసేందుకు నెపోలియన్ జపాన్‌లో ధనూష్ వివాహాం చేశారు.
 
తిరునల్వేలికి చెందిన అక్షయ అనే అమ్మాయిని ధనుష్ పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా నెపొలియన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వివాహానికి దగ్గరి బంధువులతో పాటు తమిళ సినీ పరిశ్రమకు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Polavaram: జనవరి 2, 2025న పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభం

వృద్ధ మహిళపై వీధికుక్కల గుంపు దాడి.. చివరికి ఏమైందంటే? (video)

ఉత్తరాఖండ్‌- 1,500 అడుగుల లోయలో పడిన బస్సు.. ముగ్గురు మృతి (video)

Venu Swamy: అల్లు అర్జున్‌కు మార్చి 29 వరకు టైమ్ బాగోలేదు (video)

Jani Master: శ్రీతేజను పరామర్శించిన జానీ మాస్టర్.. ఇంత వరకే మాట్లాడగలను (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments