Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాష్ షో కోసం నానికి రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా..?

తెలుగు టీవీ టీఆర్పీల్లో బిగ్ బాస్ షో ఓ సంచ‌ల‌నం. అప్ప‌టివ‌ర‌కు రాన‌టువంటి టీఆర్పీ బిగ్ బాస్ రియాల్టీ షో సాధించ‌డం తెలిసిందే. దీనికి కార‌ణం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే. అయితే.. బిగ్ బాస్ సెకండ్ సీజ‌న్‌కి ఎన్టీఆర్ అందుబాటులో లేక

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (16:26 IST)
తెలుగు టీవీ టీఆర్పీల్లో బిగ్ బాస్ షో ఓ సంచ‌ల‌నం. అప్ప‌టివ‌ర‌కు రాన‌టువంటి టీఆర్పీ బిగ్ బాస్ రియాల్టీ షో సాధించ‌డం తెలిసిందే. దీనికి కార‌ణం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే. అయితే.. బిగ్ బాస్ సెకండ్ సీజ‌న్‌కి ఎన్టీఆర్ అందుబాటులో లేక‌పోవ‌డంతో నేచుర‌ల్ స్టార్ నాని వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడ‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. నానిని ఇదే విష‌యం గురించి అడిగితే.. ఆ విష‌యం గురించి నో కామెంట్... స్టార్ మా యాజ‌మాన్యం ఎనౌన్స్ చేసేవ‌ర‌కు నేనేమి మాట్లాడ‌కూడ‌ద‌న్నాడు.
 
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... తొలి సీజన్‌లో హోస్ట్‌గా వ్యవహరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు రూ. 6.5 కోట్లు ఇచ్చిన బిగ్ బాస్ నిర్వాహకులు, ఇప్పుడు నానికి అందులో సగానికి కొంచెం ఎక్కువగా మాత్రమే ఆఫర్ చేస్తున్నారట. ఈ షో చేసినందుకు నానికి రూ. 3.50 కోట్ల రెమ్యునరేషన్ దక్కనున్నట్టు తెలుస్తోంది. దాదాపు రెండున్నర నెలల పాటు ప్రతి వారాంతంలో రెండు రోజులు అంటే, సుమారు 20 రోజుల పాటు తన సినిమాలను, కాల్ షీట్లను పక్కనబెట్టి నాని పని చేయాల్సి వుంటుంది. అయితే.. ఎన్టీఆర్‌తో పోలిస్తే నాని చిన్న హీరోనే కాబ‌ట్టి ఈ రెమ్యూన‌రేష‌న్ క‌రెక్టే అంటున్నారు సినీ పండితులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థి తండ్రితో టీచరమ్మ పరిచయం - అఫైర్.. ఆపై రూ.20 లక్షల డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments