Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సంఘాల ఫిర్యాదుతో పోలీసుల కేసు.. పరారీలో నటి కస్తూరి

ఠాగూర్
సోమవారం, 11 నవంబరు 2024 (10:21 IST)
రాజులకాలంలో అంతఃపురంలో ఉండే మహిళలకు సేవ చేసేందుకే వచ్చినవారే తెలుగు ప్రజలంటూ వ్యాఖ్యలు చేసిన తమిళ సినీ నటి కస్తూరి ఇపుడు ఇంటి నుంచి పారిపోయారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆమెపై చెన్నైలోని అనేక తెలుగు సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, మదురైలోనూ ఆమెపై కేసు నమోదైంది. దీంతో ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. కానీ, ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ప్రత్యేక బృందం పోలీసులు రంగంలోకి దిగారు. 
 
తమిళ సినీ నటి కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చెన్నై ఆళ్వార్ పేట, పోయెస్ గార్డెన్‌లోని ఇంటికి తాళం వేసి అక్కడ నుంచి పారిపోయారు. ఇటీవల తెలుగు ప్రజల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. రాజుల అంతఃపురంలో ఉండే మహిళలకు సపర్యలు చేసేందుకు వచ్చినవారే తెలుగు ప్రజలని, అలాంటి వారి తమిళ జాతీయులని గొప్పగా చెప్పుకుంటున్నారని, ఎప్పటి నుంచో ఉంటున్న బ్రహ్మణులు మాత్రం ద్రావిడులు కారా అని ఆమె ప్రశ్నించారు. 
 
ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో నటి కస్తూరిపై రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కేసులు నమోదు కాగా, పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమై చెన్నై పోయెస్ గార్డెన్‌లో ఉన్న ఆమె నివాసానికి వెళ్ళారు. అక్కడ ఆమె ఇంటికి తాళం వేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. పైగా, ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేసివుంది. 
 
కాగా, ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి చెన్నై, మదురై నగరాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె తన న్యాయవాది ద్వారా ముందస్తు బెయిల్‌కు ప్రత్యామ్నాయ చేసుకుంటున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments