Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమన్నాతో లింకు పెట్టారు.. ఎంజాయ్ చేశాను.. ఊపిరి హీరో కార్తీ

హీరో కార్తీ ఆవారా ద్వారా ఎంటరై ఊపిరి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తాజాగా కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఖాఖీ సినిమాలో నటించిన కార్తీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (17:34 IST)
హీరో కార్తీ ఆవారా ద్వారా ఎంటరై ఊపిరి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తాజాగా కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఖాఖీ సినిమాలో నటించిన కార్తీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన లవ్ సీన్స్ చూసినప్పుడు.. లవ్ సీన్స్‌లో టచ్ చేయకుండా యాక్ట్ చేయడం కష్టమా అని తన భార్య అడుగుతుంటుందని కార్తీ చెప్పారు.
 
పెర్ఫార్మెన్స్ పరంగా తాను కొంచెం ఎక్స్‌ట్రా అని.. ప్రేమ, పెళ్లి వంటి సీన్స్‌లో పూర్తిగా ఇన్వాల్స్ కాకపోతే, ఆ సన్నివేశాలు కృత్రిమంగా అనిపిస్తాయని చెప్పేవాడినని కార్తీ తెలిపారు. ఆడియన్స్‌కు ఆ ఫీల్ కలిగేలా నటించవలసి వుంటుంది. ఆ విషయంలో తన భార్యకు జెలసీ సహజమని.. ఈ విషయంలో తనకు ఆమెకు గొడవలు జరుగుతూనే వుంటాయని.. అందుకే తన సినిమాలు చూడొద్దనే తానే ఆమెకు చెప్తూ వుంటానని కార్తీ తెలిపారు. 
 
తమన్నాతో లింకుపెట్టినప్పుడు ఎంజాయ్ చేసే దాన్నని.. లవ్ స్టోరీలు, మళ్లీ మళ్లీ ఒకే హీరోయిన్‌తో చేయడంతో తమన్నాతో లింకుపెట్టారని మీడియాకు ఆ విషయం దొరికిందని కార్తీ వెల్లడించారు. ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లెవరూ తనకు ప్రపోజ్ చేయలేదన్నారు. తమన్నాతో లింక్ చేస్తూ స్పైసీ న్యూస్ కోసం కొంతమంది ఇలాంటివి సృష్టించారని.. ఒక రకంగా ఇలాంటి వార్తలను అప్పట్లో ఎంజాయ్ చేశానని చెప్పారు. 
 
కాలేజ్ లో చదువుకునేటప్పుడు ఒక్క అమ్మాయి కూడా తన వైపు చూడలేదని.. హీరో అయ్యాక లవ్ స్టోరీస్ చేస్తున్నప్పుడు కాలేజీ అమ్మాయిలు తనను పెళ్లి చేసుకోమని వెంటపడ్డారని కార్తీ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments