Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజిత్ సాహసం చేశారు.. హైదరాబాద్ టు చెన్నై బైకులోనే జర్నీ (Video)

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (15:58 IST)
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సాహసం చేశారు. బైక్ రేసు, కారు రేసులంటే అమితంగా ఇష్టపడే అజిత్ సినిమాల్లో డూప్ లేకుండా సన్నివేశాల్లో నటించి రిస్క్ తీసుకునేవారని పేరుంది. తమిళనాట తలా అని ప్రేక్షకుల చేత ముద్దుగా పిలిపించుకునే అజిత్... బైక్‌పై ఈసారి నిజ జీవితంలోనే సాహసం చేశారు. హైదరాబాద్ నుంచి బైక్‌పై బయలుదేరి దాదాపు 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి చెన్నై చేరుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ మొత్తం ప్రయాణంలో ఆహారం, పెట్రోలు కోసం మినహాయించి ఎక్కడా ఆగలేదని తెలిసింది. 'వలిమై' సినిమా బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో లాక్ డౌన్‌కు ముందు కొన్ని సీన్లు చిత్రీకరించారు. వాటిలో బైక్ చేజింగ్ సన్నివేశం కూడా ఉంది. ఈ సినిమాలో అజిత్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఆయన కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ను తయారు చేయించారు. 
 
ఈ బైక్‌పై ముచ్చటపడిన అజిత్.. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత అదే బైక్‌పై చెన్నై వెళ్లాలని నిర్ణయించుకున్నాడట. విమానం టికెట్లు రద్దు చేసుకొని బైక్‌పై ఒంటరిగా చెన్నై బయలుదేరిపోయాడు అజిత్. అతడి అసిస్టెంట్ మాత్రం విమానంలో చెన్నై చేరుకున్నాడు. అజిత్ బైక్ రైడింగ్‌కు సంబంధించిన ఫొటోలను చిత్ర బృందం విడుదల చేసి విషయం చెప్పడంతో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 
 
హైదరాబాద్ నుంచి చెన్నైకి 650 కిలోమీటర్లు. ఈ 650 కిలోమీటర్లు కేవలం బైకుపైనే అజిత్ ప్రయాణం చేశారని సినీ యూనిట్ తెలిపింది. ఇలా అజిత్ బైక్ రైడ్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.  లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది.  ఈ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. 
 

సంబంధిత వార్తలు

ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన భార్య.. సస్పెండ్ చేసిన రిజిస్ట్రార్

దేశంలో ప్రారంభమైన ఐదో విడత పోలింగ్ - ఓటేసిన ప్రముఖులు

నా భార్య కొడుతుంది.. చంపేస్తుందేమో.. నా భార్య నుండి నన్ను కాపాడండి

పోస్టల్ బ్యాలెట్ అమ్ముకున్న ఎస్ఐ.. సస్పెన్షన్!!

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments