Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తారా? యూట్యూబర్లపై హీరో ఫైర్!

ఠాగూర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (13:41 IST)
యూట్యూబర్లపై హీరో ఆది పనిశెట్టి మండిపడ్డారు. తాము అప్‌లోడ్ చేసే వీడియోలకు వ్యూస్ వచ్చేందుకు ఎంతకైనా తెగిస్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఆయన తాజాగా నటించిన చిత్రం "శబ్దం". ఈ నెల 28వ తేదీన విడుదలవుతుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం, సినీ కెరీర్ తదితర అంశాలపై స్పందించారు. తన భార్య నిక్కీ గల్రానీతో తాను విడిపోతున్నట్టు వస్తున్న కథనాలపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. 
 
ఇలాంటి వార్తలు చూసి ఎంతగానో బాధపడినట్టు చెప్పారు. అలాంటి వార్తలు రాసే వారిపై కోపం వచ్చిందన్నారు. నిక్కీ నాకు మొదటి నుంచి మంచి స్నేహితురాలన్నారు. నా కుటుంబ సభ్యులకు కూడా ఆమె ఎంతో చేరువైది. మా ఇంట్లో వాళ్లు ఆమెకు బాగా నచ్చారు. ఆమెతో ఉంటే నేను సంతోషంగా ఉంటాననిపించింది. దీంతో పెద్దల అంగీకారంతోనే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. 
 
అయితే, మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నామని కొన్ని యూట్యాబ్‌లలో కథనాలు వచ్చాయి. తొలుత వాటిని చూసి షాకయ్యా. బాగా కోపం వచ్చింది కూడా. ఆ తర్వాత ఆయన ఖాతాల్లోని పాత వీడియోలను చూడగా... ఇలాంటి యూట్యూబర్స్‌ను పట్టించుకోకపోవడం మంచిదనిపించింది. క్లిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారని అర్థమైంది అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తాం : చైనా కంపెనీ హుకుం!

గంగానది ఒడ్డుకి ట్రాలీ బ్యాగ్‌తో కోడలు, తెరిచి చూస్తే అత్త మృతదేహం ముక్కలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో వీహెచ్ భేటీ, హాయిగా టేకు మంచంపై కూర్చుని మాట్లాడుతూ... (video)

Class 10 Student: పదో తరగతి విద్యార్థి.. ఆడ శిశువుకు జన్మనిచ్చింది.. అదీ హాస్టల్‌లో.. ఎలా?

ఎమ్మెల్సీ ఎన్నికలు.. నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు.. కూటమికే ఐదు స్థానాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

తర్వాతి కథనం
Show comments