Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు భారీ సినిమాల‌ను ప్ర‌క‌టించిన అభిషేక్ అగర్వాల్

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (12:32 IST)
Vivek, Abhishek
కశ్మీర్ ఫైల్స్‌ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈరోజు త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రెండు భారీ చిత్రాల‌ను ప్ర‌క‌టించారు. ఇదేరోజు యోగా గురువు ర‌విశంక‌ర్ పండిట్ ఆశీర్వ‌చ‌నాలు తీసుకున్నారు. అనంత‌రం ఆయ‌న క‌శ్మీర్ ఫైల్స్ త‌ర‌హాలో రెండు క‌థ‌ల‌తో తీయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐ యామ్ బుద్దా ప్రొడక్షన్‌ మానవ చరిత్రకు సంబంధించిన మరో రెండు గొప్ప నిజాయితీ కథలను వెండితెరపై చూపించబోతున్నారు.
 
వీరి కాంబినేషన్‌లో విడుదలైన 'ది కాశ్మీర్ ఫైల్స్'  దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ సినిమాని ఆకర్షించింది. 1990లో కాశ్మీరీ పండిట్‌లు ఎదురుకున్న నాటి పరిస్థితులని హృదయాన్ని కదిలించేలా తెరపై ఆవిష్కరించారు. నిజాయితీ చెప్పిన ఈ కథ కోట్లాది ప్రేక్షకులు మనసులను గెలుచుకుంది. ఇప్పుడు అంతే నిజాయితీతో వివేక్ రంజన్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి మరో రెండు నిజాయితీ గల కథలు వెండితెరపై చూపించాలని సంకల్పించారు.
 
250 కోట్ల క్లబ్‌లో చేరిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తూ ప్రదర్శింపబడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు ఈ చిత్రాన్ని అభినందించారు. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చే సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
 
తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పల్లవి జోషి ఈ రెండు చిత్రాలను నిర్మించనున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments