Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభినవ్ గోమటం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా సంతాన ప్రాప్తిరస్తు

దేవి
బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (17:57 IST)
Abhinav Gotam, Santana Praptirastu
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు".  ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. "ఏబీసీడీ" దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా తెరకెక్కుతోంది.
 
ఈ రోజు "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా నుంచి అభినవ్ గోమటం నటించిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సుబ్బు క్యారెక్టర్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.  పాన్ ఇండియా మాట్రిమోని ప్రొఫైల్స్ ఉన్న ఫ్రస్టేటెడ్ అన్ మారీడ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సుబ్బు పాత్రలో అభినవ్ గోమటం ప్రేక్షకుల్ని నవ్వించబోతున్నారు. సుబ్బు ఫ్రస్టేషన్ ఏ స్థాయిలో కామెడీ పండించిందో థియేటర్స్ లో చూడాల్సిందే.
 
ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా "సంతాన ప్రాప్తిరస్తు" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
 
నటీనటులు - విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్,  తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, శ్రీ లక్ష్మి, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనీల్ గీల, సద్దాం తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో భారీ వర్ష సూచన - కంట్రోల్ రూమ్ ఏర్పాటు

రష్యాలో ఘోర అగ్ని ప్రమాదం - 11 మంది సజీవదహనం

అధిక వడ్డీ ఆశ పేరుతో రూ.20 కోట్ల మోసం... వ్యక్తి పరార్

ప్రయాణికుల రద్దీ - శుభవార్త చెప్పిన రైల్వే శాఖ - నేడు రేపు స్పెషల్ ట్రైన్స్

కుటుంబ కలహాలు - ఇద్దరు పిల్లను చంపి తండ్రి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments