Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

డీవీ
శనివారం, 1 జూన్ 2024 (18:03 IST)
Abhijit Gokale- Sanskarabhrathi
మన దేశ చరిత్ర, సంస్క్రుతిని కాపాడాలనే క్రుతనిశ్చయంతో నెలకొల్పబడిన సంస్కారభారతి తాజాగా సినిమా కథలలో కూడా అందుకు తోడ్పడేలా దర్శక నిర్మాతలు చర్యలు తీసుకోవాలని కోరింది. శనివారంనాడు హైదరాబాద్ మణికొండలోని కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఫిల్మ్ రివ్యూ జర్నలిస్టుల సమావేశంలో సంస్కారభారతి అఖిల భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ అభిజిత్ గోకలే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు చర్చించారు. గతంలో పలు రంగాలలో తాము చేస్తున్న సేవలను ఉదహరించారు.
 
ఇక సినిమాల విషయానికి వచ్చేసరికి ఆదిపురుష్ లో రామాయణాన్ని వక్రీకరించి ఇదే అసలు కథగా భావి తరాలకు నిర్దేశంగా మారే ప్రమాదంగా వుందని కనుక సంస్కారభారతి తరఫున మీరేం చేశారని వెబ్ దునియా అడిగిన ప్రశ్నకు గోఖలే స్పందించారు. రామాయణం అనేది వాల్మీకి రచించిన గ్రంథాన్ని పలు రూపాల్లో పలువురు కథలుగా చెబుతున్నారు. కానీ ఆదిపరుష్ లో గ్రాఫిక్స్ ఎక్కువ కావడంతో కథలో పట్టు తగ్గి కార్టూన్ సినిమా మారిందనీ, దీనిపై అయోధ్యతో సహా పలుచోట్ల దర్శక నిర్మాతలతో చర్చలు జరిగాయని తెలిపారు. 
 
Meet and greet with film review journalists
ప్రధానంగా సినిమాలు ఏ కోణంలో తీస్తున్నారో సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయనేది సమీక్షలు రాయాల్సిన అవసరం వుందని సూచించారు. సెన్సార్ విషయంలో కూడా కొన్ని సవరణలు అవసరం తేల్చిచెప్పారు. అడల్ట్ కంటెంట్ తో వస్తున్న ఓటీటీ సినిమాలకు కూడా సెన్సార్ వుండాలనేది తమ వాదనని తెలియజేస్తూ, ఈ విషయాన్ని కేంద్రం ద్రుష్టికి తీసుకెళతామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెరుపు వేగంతో రోడ్డుపై యువకుడిని ఢీకొట్టిన బైక్, నడిపే వ్యక్తి మృతి (Video)

సకల వర్గాల ప్రజల మేలు కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూర్యారాధన

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments