ఎమోషనల్ థ్రిల్లర్ ఆరంభం నుంచి హీరోయిన్ శివాని నాగరం పాడిన లిరికల్ సాంగ్

డీవీ
శనివారం, 16 మార్చి 2024 (17:41 IST)
Mohan Bhagat, Supreeta
మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఆరంభం". ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న "ఆరంభం" సినిమా నుంచి ఇవాళ ఫస్ట్ లిరికల్ సాంగ్ 'అమాయకంగా..' రిలీజ్ చేశారు.
 
సింజిత్ యెర్రమిల్లి సంగీతాన్ని అందించిన ఈ పాటకు శ్రీకాంత్ అల్లపు లిరిక్స్ రాశారు. ఇటీవల "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శివాని నాగరం ఈ పాటను పాడటం విశేషం. 'అమాయకంగా హడావుడేమి లేక..తార చేరుకుందా ఇలా. అయోమయంగా తలాడించులాగ, నేల మారుతుందే ఎలా..కాలానికే కొత్త రంగు పూసే, మాయతార సొంతమేగా, హాయి సంతకాలు చేసేనా..' అంటూ లవ్ ఫీల్ తో బ్యూటిఫుల్ కంపోజిషన్ తో సాగుతుందీ పాట. ఈ పాటకు శివాని నాగరం వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
 
"ఆరంభం" సినిమా ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ దాడులు: ఖండించిన భారత్

పూటుగా లిక్కర్ సేవించి ర్యాపిడో ఎక్కిన యువతి, సీటు నుంచి జారుతూ... వీడియో వైరల్

Survey: సర్వేలో బాలకృష్ణపై హిందూపూర్ ప్రజలు ఏమంటున్నారు?

రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతాడనుకుంటే అలా అయ్యారు: వీడియోలో కెఎ పాల్

పులివెందులలో జగన్‌కు ఎదురుదెబ్బ.. వేంపల్లి నుండి టీడీపీలో చేరిన వైకాపా సభ్యులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

తర్వాతి కథనం
Show comments