Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన అమితాబ్ మనుమరాలు.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (09:47 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనుమరాలు ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ - అభిషేక్ బచ్చన్‌ల కుమార్తె అరాధ్య కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తనపై అవాస్తవాలు వ్యాప్తి చేస్తున్న టాబ్లాయిడ్‌ను నిలువరించాలంటూ అభ్యర్థించారు.
 
తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై ఆ యూట్యూబ్ టాబ్లాయిడ్ తప్పుడు కథనాలు ప్రచురిస్తుందని ఆరాధ్య తన పిటిషన్‌లో పేర్కొంది. తాను మైనర్ అయినందువల్ల ఇలాంటి వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని కోర్టును కోరింది. ఈ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరుగనుంది. 
 
కాగా, ఆరాధ్య బచ్చన్‌ గతంలోనూ ట్రోలింగ్‌కు గురైంది. తన వ్యక్తిగత జీవితమే లక్ష్యంగా ఆమెపై ట్రోల్స్ అవాకులు చవాకులు రాసుకొచ్చారు. ఈ తీరుపై అభిషేక్ బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోలింగ్‌కు అస్సలు ఆమోదయోగ్యం కాదు. 
 
ఎవరూ దాన్ని సహించకూడదు. అయితే, ఓ పబ్లిక్ ఫిగర్‌గా ట్రోలింగ్ ఎందుకు జరుగుతుందో నేను అర్థం చేసుకోగలను. కానీ, నా కుమార్తెపై ట్రోలింగ్ ఏ రకంగాను సమర్థనీయం కాదు. ఏమైనా అనాలంటే నేరుగా తననే విమర్శించాలని అభిషేక్ బచ్చన్ కోరారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments