Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంజయ్‌ దత్‌కు తండ్రిగా అమీర్ ఖాన్.. రణబీర్ కపూర్ పాత్రేంటి?

ఇదేంటి? సంజయ్‌ దత్‌కు మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ తండ్రిగా నటించబోతున్నాడా? అని అనుకుంటున్నారు కదూ.. అయితే సంజయ్ దత్ బయోపిక్‌లో అమీర్ ఖాన్ నటించనున్నట్లు బాలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. మున్నాభాయ్ ఎం

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (14:45 IST)
ఇదేంటి? సంజయ్‌ దత్‌కు మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ తండ్రిగా నటించబోతున్నాడా? అని అనుకుంటున్నారు కదూ.. అయితే సంజయ్ దత్ బయోపిక్‌లో అమీర్ ఖాన్ నటించనున్నట్లు బాలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి.

మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, పీకే వంటి సినిమాలను రూపొందించిన రాజ్ కుమార్.. తాజాగా సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన సంప్రదింపుల కోసం రాజ్ కుమార్ అమీర్ ఖాన్‌ను కలిసినట్లు తెలుస్తోంది. 
 
సంజయ్ దత్ కూడా తన కథను హిరాణీ అయితేనే బాగా తీయగలడని భావించడంతో దర్శకత్వ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. ఈ క్రియేటివ్ డైరెక్టర్ అయిన రాజ్ కుమార్.. ఇప్పటికే సంజయ్ పాత్రలో యంగ్ హీరో రణబీర్‌ను ఎంచుకున్నాడు.

కాగా, ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం సంజయ్ దత్ తండ్రి పాత్రకు అమీర్ ఖాన్‌ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ దంగల్ సినిమాలో ఇద్దరు పిల్లల తండ్రి పాత్రలో నటిస్తున్న అమీర్ ఖాన్.. రణబీర్ కపూర్ వంటి యంగ్ హీరోకు తండ్రిగా నటిస్తాడా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అదే గనక జరిగితే ఇక బిటౌన్లో సెన్సేషన్ కాక తప్పదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు!!

MLC Election: మార్చి 20న ఎన్నికలు.. అదే రోజు లెక్కింపు

Achchennaidu: వచ్చింది పది నిమిషాలే.. జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్

ప్రతిపక్ష హోదా కావాలా? జర్మనీకి వెళ్లండి జగన్: డిప్యూటీ సీఎం పవన్ పంచ్

వాళ్లు ప్రతిపక్ష హోదా ఇవ్వరు... సో.. అసెంబ్లీకి వెళ్లొద్దు : జగన్ నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments