Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను రూ.100 కోట్లు ఇస్తా.. ఓ కుక్కతో పడుకుంటావా...

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (11:22 IST)
బాలీవుడ్ చిత్ర రంగాన్ని మీటూ ప్రకంపనలు కుదిపేస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు, నిర్మాత షాజిద్ ఖాన్‌‌ తనకు నరకం చూపించాడంటూ ఇటీవల సలోనీ చోప్రా ఆరోపణలు చేసింది. తాజాగా షాజిద్‌పై 'లిప్‌స్టిక్ అండర్ మే బుర్ఖా' నటి ఆహన కుమ్రా సంచలన ఆరోపణలు చేసింది. 
 
ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'షాజిద్ నిజస్వరూపం తెలిసినప్పటికీ ఓ మీటింగ్ నిమిత్తం వాళ్ల ఇంటికి వెళ్లాను. నేను ఇంట్లో అడుగుపెట్టగానే ఆయన చీకటిగా ఉన్న తన రూమ్‌లోకి తీసుకెళ్లారు. నేను బయట కూర్చుందామని చెబితే.. అక్కడ కూర్చున్న వాళ్ల అమ్మకు ఇబ్బంది అవుతుందంటూ నిరాకరించారు' అని పేర్కొంది. 
 
'ఆయన ప్రవర్తనపై అనుమానం రావడంతో ముందే నేను పోలీస్ అధికారి కూతురినని చెప్పాను. అయినప్పటికీ పట్టించుకోకుండా దారుణ ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు. 'నేను రూ.100 కోట్లు ఇస్తా.. ఓ కుక్కతో పడుకుంటావా' అని అడిగారని చెప్పారు. 
 
'ఒకవేళ నేను ఆయన సినిమాలో ముఖ్యమైన పాత్ర కోరుకుంటే తప్పకుండా తాను చెప్పినట్టు వింటాననీ, శృంగార జోక్‌లకు నవ్వుతానని అనుకున్నారు. అయితే నేను గట్టిగా నిలబడడంతో నా గొంతు బాగోలేదనీ.. ప్రతిదానికీ ఎక్కువ ఆలోచిస్తున్నానని వంకలు పెట్టి ముఖ్యమైన పాత్రల్లో కనిపించకుండా చేశారు' అని ఆమె ఆరోపణలు గుప్పించింది. షాజిద్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో "హౌస్‌ఫుల్ 4'' నిర్మాతలు అతడిని దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Adilabad: ఆదిలాబాద్ గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు.. ఎప్పుడంటే?

Floods: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 50 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు- భారీ నష్టం

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి

తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది : ప్రధాని నరేంద్ర మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం