Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆది పినిశెట్టి క్రైమ్ థ్రిల్లర్ శబ్దం విడుదలకు సిద్ధమవుతోంది

డీవీ
శుక్రవారం, 27 డిశెంబరు 2024 (12:39 IST)
Aadi Pinishetti- Shabadam
‘వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు రెండోసారి సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’ తో రాబోతున్నారు. 7G ఫిల్మ్స్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్ బానుప్రియ శివ సహనిర్మాత. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 
తాజా మేకర్స్ ‘శబ్దం’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 28, 2025న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ హీరో ఆది పినిశెట్టి ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది.  
 
ఈ చిత్రాన్ని ముంబయి, మున్నార్, చెన్నైలోని అనేక ప్రదేశాలలో చిత్రీకరించారు. కేవలం ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసమే 2 కోట్ల రూపాయల బడ్జెట్‌తో 120 ఏళ్ల నాటి లైబ్రరీ సెట్‌ను నిర్మించారు. 
 
సంగీత దర్శకుడు థమన్ సినిమా కోసం ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్ ,ఆర్ఆర్ చేయడానికి హంగేరీకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.
 
సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లీ, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
ఈ చిత్రానికి అరుణ్ పద్మనాబన్ డీవోపీగా పని చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సాబు జోసెఫ్ ఎడిటింగ్ చేస్తున్నారు. మనోజ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.
 
తారాగణం: ఆది పినిశెట్టి, సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లీ, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బైకును కారులా మార్చేశాడు.. ఆరుగురితో హ్యాపీగా జర్నీ చేశాడు.. (వీడియో)

సీతమ్మకు తాళికట్టిన వైకాపా ఎమ్మెల్యే.. అడ్డుకోని పండితులు...

జైపూరులో ఘోరం: బైకర్లపై దూసుకెళ్లని ఎస్‌యూవీ కారు.. నలుగురు మృతి

వాటర్ వరల్డ్‌లోపడిన ఆరేళ్ల బాలుడు... ఆస్పత్రికి తరలించేలోపు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments