Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 2న అ... ఆ... త్రివిక్రమ్, నితిన్, సమంత కాంబినేషన్...

'అ..ఆ..'.. తెలుగు సినీ పరిశ్రమలో ఈ వేసవికి భారీ క్రేజ్‌ ఉన్న సినిమాలన్నీ విడుదలయ్యాక, ఆ స్థాయి క్రేజ్‌తో విడుదలకు సిద్ధంగా ఉన్న ఏకైక సినిమా. దర్శకుడు త్రివిక్రమ్‌, నితిన్‌, సమంతల క్రేజీ కాంబినేషన్‌లో

Webdunia
గురువారం, 26 మే 2016 (20:59 IST)
'అ..ఆ..'.. తెలుగు సినీ పరిశ్రమలో ఈ వేసవికి భారీ క్రేజ్‌ ఉన్న సినిమాలన్నీ విడుదలయ్యాక, ఆ స్థాయి క్రేజ్‌తో విడుదలకు సిద్ధంగా ఉన్న ఏకైక సినిమా. దర్శకుడు త్రివిక్రమ్‌, నితిన్‌, సమంతల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇప్పటికే అన్ని పోస్ట్‌‌ప్రొడక్షన్‌ పనులను పూర్తిచేసుకోగా, తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని విడుదలకు పక్కాగా సిద్ధమైపోయింది. సెన్సార్‌ బృందం ఈ సినిమాకు ఎటువంటి కట్స్‌ చెప్పకుండా క్లీన్‌ 'యూ' సర్టిఫికెట్‌ జారీ చేసింది.
 
ఇక సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తయిపోవడంతో, రేపట్నుంచి పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టేందుకు టీమ్‌ ప్లాన్‌ చేస్తోంది. త్రివిక్రమ్‌, నితిన్‌, సమంత స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొననున్నారు. త్రివిక్రమ్‌ మార్క్‌ భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ సినిమాను హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మించారు. మళయాలంలో 'ప్రేమమ్‌' సినిమాతో సంచలనం సృష్టించిన అనుపమ పరమేశ్వరన్‌ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా జూన్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments