Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ నేప‌థ్యంగా సుధీర్ బాబు హంట్

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (17:18 IST)
Sudheer Babu'
అర్జున్ ఓ పోలీస్. అత‌నిలో ఇద్దరు ఉన్నారు.ఒకరు 'ఎ', మరొకరు 'బి' అనుకుంటే... అర్జున్ 'ఎ'కి తెలిసినమనుషులు, ఇన్సిడెంట్స్, పర్సనల్ లైఫ్ ఏదీ అర్జున్ 'బి'కి తెలియదు. వేర్వేరు మనుషులుఅన్నట్టు! అయితే... అర్జున్ 'ఎ'కి తెలిసిన భాషలు, స్కిల్స్, పోలీస్ ట్రైనింగ్ అర్జున్'బి'లో ఉన్నాయి. అర్జున్ 'ఎ'గా ఉండటమే అర్జున్‌కు ఇష్టం! అతని కోరిక నెరవేరిందా? అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయినా కేసు ఏమిటి? అనేది 'హంట్' సినిమాలోచూడాల్సిందే అని చిత్ర యూనిట్ చెబుతోంది.
 
సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నసినిమా 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ ప్రధానపాత్రలు పోషించారు. నేపథ్యంలో రూపొందుతోన్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ రోజుటీజర్ విడుదల చేశారు.
 
'హంట్' టీజర్ యాక్షన్ ప్యాక్డ్‌గా కట్ చేశారు. సినిమాపై విపరీతమైన అంచనాలుపెంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సుధీర్ బాబు నటనకు తోడు సిక్స్ప్యాక్ కూడా ఆట్టుకునేలా ఉంది. 'తను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రాసెస్‌లో ఎవరుఎఫెక్ట్ అయినా... ఎంత ఎఫెక్ట్ అయినా... నన్ను ఎవరూ ఆపలేరు' అని టీజర్చివరలో సుధీర్ బాబు చెప్పే డైలాగ్ మరింత క్యూరియాసిటీ పెంచింది. 
 
సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ సైతం పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తున్నచిత్రమిది. విడుదలైన కొన్ని క్షణాల్లో 'హంట్' టీజ‌ర్‌కు సోషల్ మీడియాలో అదిరిపోయేరెస్పాన్స్ లభించింది. ట్రెండ్ అవుతోంది.   
 
చిత్ర నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ ''టీజర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచిఅద్భుత స్పందన లభిస్తోంది. సుధీర్ బాబు పెర్ఫార్మన్స్‌కు ప్రశంసలు లభిస్తున్నాయి. యాక్షన్ బావుందని చెబుతున్నారు. థ్రిల్లింగ్‌గా ఉందంటున్నారు. టీజర్, సుధీర్ బాబునటన సినిమాపై అంచనాలు పెంచాయి. అంచనాలను అందుకునే విధంగా సినిమాఉంటుంది. ఇదొక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్. చిత్రీకరణ పూర్తయింది. సినిమా బాగా వచ్చింది. ప్రస్తుతం రీ రికార్డింగ్ దశలో ఉంది. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని అన్నారు. 
 
చిత్ర దర్శకుడు మహేష్ మాట్లాడుతూ ''ఇంటర్నేషనల్ టెర్రరిజంను టచ్ చేస్తూతెరకెక్కించిన పోలీస్ థ్రిల్లర్ ఇది. టీజర్‌కు లభిస్తున్న స్పందన సంతోషాన్ని కలిగిస్తోంది. అర్జున్ ప్రసాద్ క్యారెక్టర్ కోసం సుధీర్ బాబు గారు ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఫిట్ అండ్ లీన్లుక్‌లోకి వచ్చారు. ఇప్పటి వరకు ఆయన ఇటువంటి కాప్ థ్రిల్లర్ చేయలేదు. ఆయనక్యారెక్టర్, కథ, సినిమా చాలా కొత్తగా ఉంటాయి. కొన్ని యాక్షన్ సీక్వెన్సులు ఫ్రాన్స్‌లో తీశాం. ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇవ్వడంతో పాటు కొత్త కాన్సెప్ట్‌ను చూపిస్తుందీ సినిమా'' అనిఅన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Yadagirigutta: యాదగిరిగుట్ట.. దర్శనం క్యూలైన్ గ్రిల్‌లో ఇరుక్కున్న బాలుడి తల (video)

South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదం.. 179మంది సజీవదహనం

రుణం తీర్చలేదు.. బ్యాంక్ అధికారుల ఒత్తిడి.. వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకుని, విషం తాగి కానిస్టేబుళ్ల ఆత్మహత్య.. భార్యాబిడ్డలకు కూడా..?

పవన్ కల్యాణ్‌కు దివ్వెల మాధురి వార్నింగ్.. డ్యాన్స్‌కు శ్రీనివాస్ ఫిదా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments