Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాజెక్ట్ – కె నుంచి దీపికా పదుకొనే ప్రత్యేక పోస్టర్‌

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (18:13 IST)
Deepika Padukone
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రాజెక్ట్ కె, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీగా రూపుదిద్దుకుం టుంది.  దీపికా పదుకొణె  కథానాయిగా నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్  పుట్టినరోజుల సందర్భంగా ప్రీ-లుక్ పోస్టర్ ‌లను ఇదివరకే విడుదల చేశారు మేకర్స్. తాజాగా దీపికా పదుకొణె పుట్టినరోజు సందర్భంగా  శుభాకాంక్షలు తెలిపిన టీమ్ చిత్రంలోని ఆమె ప్రత్యేక పోస్టర్‌ ను విడుదల చేసింది.
 
సిల్హౌట్ ఇమేజ్ దీపిక ఒక కొండపై నిలబడి వున్నట్లుగా చూడవచ్చు. సూర్యకిరణాలు ఆమె శరీరంపై పడటం గమనించవచ్చు. పోస్టర్‌పై “ఎ హోప్ ఇన్ ది డార్క్” అనే ట్యాగ్‌లైన్ పాత్ర యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
 
ప్రాజెక్ట్ - కె భారతీయ సినిమాల్లో అత్యధిక బడ్జెట్‌ తో రూపొందుతున్న చిత్రం. దర్శకుడు నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ , ఇతర ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇటివలే  చక్రం తయారీని చూపించిన BTS వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  చిత్ర బృందం సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి ఎంత కృషి చేస్తోందో ఈ వీడియో  తెలియజేస్తోంది.
 
విజయవంతంగా 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకుంటున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అశ్విని దత్ నిర్మాణంలో ఈ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్‌ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments