Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి నుండి శృంగార గీతం

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2023 (17:20 IST)
Ravi Teja, Neha Jurel
తన్విక అండ్ మొక్షిక క్రియేషన్స్ పతాకంపై నూతన తారలు రవితేజ నున్న హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం ' రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి'. సత్య రాజ్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు నిర్మాతలు.  
 
ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన "ఐ లవ్ యు" గీతం ప్రేక్షకులను కట్టిపడేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి శృంగార గీతం "ధిర ధిరన" లిరికల్ వీడియో విడుదలైంది.
 
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం చేయటం విశేషం. రోషన్ సాలూరి స్వరపరిచిన "ధిర ధిరన" గీతం ఆకట్టుకుంటోంది. సాహితి చాగంటి ఆలపించిన ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించారు. రోషన్ సాలూరి మధురమైన సంగీతానికి సాహితి చాగంటి గాత్రం, రెహమాన్ సాహిత్యం తోడై పాట మరింత అందంగా మారింది. లిరికల్ వీడియోలో నాయికా నాయకుల మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. థియేటర్లలో ఈ సాంగ్ యువత మనసు దోచుకోవడం ఖాయమనిపిస్తోంది.
 
ఈ  చిత్ర కథాంశం, ఈ తరం సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన 'రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి' టీజర్ మెప్పించింది. ప్రేక్షకులలో ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేయడానికి ఈ చిత్రం యొక్క ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం కొద్ది రోజులలో  థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులను అలరించడానికి  సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments