Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

ఠాగూర్
ఆదివారం, 17 ఆగస్టు 2025 (17:57 IST)
సినిమా కలెక్షన్స్ దర్శకులు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారని, కోలీవుడ్ దర్శకులు మాత్రం ప్రతి ఒక్కరినీ ఎడ్యుకేట్ చేస్తారని తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ అన్నారు. శివకార్తికేయన్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం మదరాసి. సెప్టెంబరు 5వ తేదీన విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆయన ఓ ట్యూబ్ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. 
 
ఇందులో తమిళ అగ్ర దర్శకుల కొత్త చిత్రాల పరాజయంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ముఖ్యంగా, శంకర్‌ తెరకెక్కించిన ‘భారతీయుడు 2’, ‘గేమ్‌ ఛేంజర్‌’, మణిరత్నం రూపొందించిన ‘థగ్‌లైఫ్‌’ చిత్రాల ప్రస్తావన రాగా.. ఒకట్రెండు సినిమాలు ఫెయిల్‌ అయినంత మాత్రాన లెజెండ్స్‌పై ప్రభావం పడదన్నారు. రూ.100 కోట్ల (సినిమా కలెక్షన్స్‌) దర్శకులు ప్రేక్షకులకు వినోదం మాత్రమే పంచుతారని, తమిళ డైరెక్టర్లు ఎడ్యుకేట్‌ చేస్తారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 
సల్మాన్‌ఖాన్‌ హీరోగా తాను తెరకెక్కించిన ‘సికందర్‌’ ఫెయిల్యూర్‌పై మురుగదాస్‌ మరోసారి మాట్లాడారు. హృదయానికి దగ్గరైన కథను అనుకున్న విధంగా తెరకెక్కించలేకపోయానని అన్నారు. నిర్మాణ దశలో కథ మారిందని, ఆ మూవీ పరాజయానికి బాధ్యుడిని కాదని పేర్కొన్నారు. ‘తుపాకి’ సినిమాకి సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు మురుగదాస్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments