Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప-2 కొత్త రికార్డ్-32 రోజుల్లో రూ.1,831 కోట్ల వసూలు.. బాహుబలి-2ను దాటేసింది..

సెల్వి
సోమవారం, 6 జనవరి 2025 (19:58 IST)
డిసెంబర్ 4న, పుష్ప-2: ది రూల్ భారతీయ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తాజాగా కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కేవలం 32 రోజుల్లో, ఈ చిత్రం రూ.1,831 కోట్లను కలెక్ట్ చేసి భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ ఫీట్ గతంలో రూ.1,810 కోట్లు వసూలు చేసిన 'బాహుబలి-2' రికార్డును అధిగమించింది.
 
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2: ది రూల్' చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మించారు. విడుదలకు ముందే, ఈ చిత్రం రికార్డ్-బ్రేకింగ్ ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో సంచలనం సృష్టించింది. ప్రీమియర్ షోలకు అధిక సానుకూల సమీక్షలు వచ్చాయి.
 
ప్రేక్షకులు, విమర్శకుల నుంచి అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వం గురించి ప్రశంసలు వెల్లువెత్తాయి అంతర్జాతీయ చలనచిత్ర ప్రేమికులు ఈ చిత్రంపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా 32 రోజుల్లో రూ.1,831 కోట్లతో సరికొత్త మైలురాయిని తన ఖాతాలో వేసుకుంది. 
 
తద్వారా 'పుష్ప-2' భారతీయ సినిమాలో ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్ర పోషించగా, ప్రఖ్యాత సంగీత స్వరకర్త దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సౌండ్‌ట్రాక్ ఈ చిత్రానికి మరింత ఆకర్షణను పెంచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారులో మంటలు: యువతితో పాటు సజీవ దహనమైన వ్యాపారి

పోలీస్ స్టేషన్‌ల మధ్య సరిహద్దు వివాదం... గంటలకొద్దీ రోడ్డుపైనే మృతదేహం!!

HMPV లక్షణాలు: దగ్గినప్పుడు.. తుమ్మినప్పుడు.. మాస్క్ ధరించడం మంచిది..

తెలుగు భాష కనుమరుగు కాకముందే రక్షించుకోవాలి : మంత్రి కిషన్ రెడ్డి

శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి కలకలం.. పూజారి ఇంట సంచారం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments