Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాల‌ను కాపాడే ఉక్కు క‌ర్మాగారం. ఆలోచించండ‌న్న‌ మెగాస్టార్‌

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (20:33 IST)
megastar ph
దేశ‌మంతా ఆక్సిజ‌న్ దొర‌క్క క‌రోనా పేషెంట్లు అల్లాడిపోతున్నారు. ఈరోజు ఒక స్పెష‌ల్ రైలు విశాఖ ఉక్కు క‌ర్మాగారానికి చేరింది. అక్క‌డ‌నుంచి 150 ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను మ‌హారాష్ట్రకు తీసుకెళ్ళింది. విశాఖ‌ప‌ట్నం ఉక్కు క‌ర్మాగారం రోజుకు 100 ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఇప్పుడున్న అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో ఎన్నో రాష్ట్రాల‌కు ఆక్సిజ‌న్ అందించి ల‌క్ష‌ల ప్రాణాల‌ను నిల‌బెడుతుంది. అలాంటి ఉక్కు క‌ర్మాగారం న‌ష్టాల్లో వుంద‌ని ప్రైవేట్‌ప‌రం చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం? 
మీరే ఆలోచించండి? అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశాడు. మ‌రి ప్ర‌భుత్వం ఏమంటుందో? 
ఎలా స్పందిస్తుందో చూడాలి.

mega, governer
గ‌వ‌ర్న‌ర్ అభినంద‌న
ఇదిలా వుండ‌గా,  క‌రోనా వ‌ల్ల ఇబ్బందిప‌డుతున్న కార్మికుల‌కు చిరంజీవి ప‌లు సాయాలు అంద‌జేశారు. కరోనా క్రైసిస్ ఛారిటీ ఆధ్వర్యంలో సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులకు సినీ పెద్దలు నిత్యావసరాలను అందించారు. అప్పుడు వసూలు అయిన విరాళలలో కొంత మొత్తం ఇంక ఈ ఛారిటీ సంస్థలో ఉంది. దాంతో చిరంజీవి ఆ మొత్తాన్ని వాక్సినేషన్ కు ఉపయోగించాలని భావించారు. గురువారం నుండి 45 సంవత్సరాల పైబడిన సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులకు వాక్సినేషన్ కార్యక్రమాన్ని అపోలో హాస్పిటల్ నేతృత్వంలో మొదలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ గవర్నర్ తమిళసై చిరంజీవిని అభినందించారు. అందుకు గానూ సీసీసీ తరఫున చిరంజీవి ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమ మద్దత్తుతోనే ఈ కార్యక్రమం జరుగుతోందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments