Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో మాసీవ్ సెట్‌లో భోళా శంకర్ పాట చిత్రీకరణ

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (18:41 IST)
bhola shankar song
మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం 'భోళా శంకర్' మ్యూజికల్ ప్రమోషన్లు ఇటీవలే మొదటి పాట భోళా మానియాతో ప్రారంభమయ్యాయి. ఈ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. మహతి స్వర సాగర్ ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకొని ఫుట్ టాపింగ్ మాస్ నంబర్‌ను స్కోర్ చేసారు. చిరంజీవి డ్యాన్స్‌లు చూడటానికి కన్నుల పండగలా వున్నాయి.
 
రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్ , ఇతర నటీనటులందరిపై ఓ డ్యాన్స్ నెంబర్ ని షూట్ చేస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. మహతి అందించిన డ్యాన్స్ నంబర్‌ను ఎక్స్ టార్డినరిగా చిత్రీకరిస్తున్నారు.  
 
అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. ట్యాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ తరహా పాత్రలో కనిపించనున్నారు.
 
డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
భోళా శంకర్  ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
 
తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష, ప్రదీప్, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, వేణు టిల్లు, తాగుబోతు రమేష్, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, వీర్, షావర్ అలీ & తరుణ్ అరోరా

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్తగా 10 రైళ్లను ప్రవేశపెట్టిన భారతీయ రైల్వే.. ముందస్తు రిజర్వేషన్ లేకుండానే...

డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం... జన్మతః పౌరసత్వం చట్టం

Tulasi Reddy: నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి.. నవ్వు తెప్పిస్తుంది.. తులసి రెడ్డి

ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తనపని మొదలెట్టిన డోనాల్డ్ ట్రంప్!!

అధ్యక్ష భవనాన్ని మాత్రమే వీడాను... పోరాటాన్ని కాదు.. జో బైడెన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

తర్వాతి కథనం
Show comments