Webdunia - Bharat's app for daily news and videos

Install App

అ.. ఆ.. రివ్యూ రిపోర్ట్ : అనసూయ రామలింగం - ఆనంద్ విహారి లవ్‌స్టోరీ.. కెమిస్ట్రీ అదుర్స్!

అ.. ఆ.. రివ్యూ రిపోర్ట్.. లవ్ కెమిస్ట్రీ అదుర్స్...

Webdunia
గురువారం, 2 జూన్ 2016 (14:09 IST)
నితిన్ - సమంత జంటగా నటించిన చిత్రం "అ.. ఆ.. (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి)". మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఇందులో నితిన్‌కి చెల్లెలుగా ప్రముఖ హీరోయిన్ అనన్య నటించింది. సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే మంచి అంచనాలతో గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది  ఇప్పుడు ఈ చిత్ర రివ్యూను చూద్ధాం. 
 
నటీనటులు : నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్, అనన్య
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
కథ: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాణం: హారిక అండ్ హారిక క్రియేషన్స్
నిర్మాత: ఎస్. రాధాకృష్ణ
సంగీతం: మిక్కీ జె. మేయర్
సినిమా నిడివి: 154 నిముషాలు
రిలీజ్ డేట్: 02-06-2016
 
కథ : ఈ సినిమాలో ఆనంద్(నితిన్) ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన పల్లెటూరి అబ్బాయిగా నటించాడు. అనసూయ రామలింగం (సమంత) కోటీశ్వరుని కూతురిగా నటించింది. అనసూయ రామలింగం (సమంత), ఆనంద్ విహారి (నితిన్)లు ఇద్దరు ట్రైన్‌లో కలుసుకుంటారు. ట్రైన్‌లో కలుసుకున్న వీరిద్దరూ మొదటి చూపులోనే ఇష్టపడతారు. కానీ వారి ప్రేమను ఒకరికొకరు బయటకు చెప్పుకోరు. కాగా ఈ నేపథ్యంలో ఆనంద్ విహారి(నితిన్) కుటుంబ సభ్యులు అతనికి వేరే అమ్మాయి(అనుపమ)తో పెళ్ళి కుదురుస్తారు. అయితే ఒకరినొకరు ప్రేమించుకున్న నితిన్, సమంతలు మళ్లీ కలుస్తారా? లేక తన కుటుంబం కోసం నితిన్ తన ప్రేమను త్యాగం చేసాడా? అనేది అసలు స్టోరీ.
 
ఈ సినిమాలో నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్‌ల నటన సినిమాకి హైలైట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నితిన్, సమంత, మధ్య లవ్ సీన్స్‌లో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమాలో నటించిన నటీనటులు రావు రమేష్, నదియా, నరేష్, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, అవసరాల శ్రీనివాస్, అలీ తమదైన శైలిలో నటించి అందరిని ఆకట్టుకున్నారు.
 
విశ్లేషణ:
అ..ఆ.. సినిమా ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా మొదలైన దగ్గర నుండి చివరి వరకు మనసుకు హత్తుకునే సన్నివేశాలతో త్రివిక్రమ్ తనదైన శైలిలో ప్రేక్షకులను కట్టిపడేశాడు. సమంత అల్లరి చేష్టలు, నితిన్ యాక్టింగ్ ఎక్కడా ప్రేక్షకులని బోర్ కొట్టించలేదు. కుటుంబసమేతంగా అందరూ చూడదగిన చిత్రం. ఈ సినిమాతో త్రివిక్రమ్ మరో హిట్ కొట్టినట్టే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments