Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 1న విడుదల కానున్న రాంగోపాల్ వర్మ ‘రాయ్’ ఫస్ట్ లుక్

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (11:36 IST)
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో సి.ఆర్.మనోహర్(ఎం.ఎల్.సి) నిర్మాతగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాయ్’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మే 1వ తేది సాయంత్రం ముత్తప్ప రాయ్ పుట్టినరోజు సందర్భంగా యాబై వేల మంది ప్రజల మధ్యలో విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బెంగుళూరులోని బిదాడి వేదిక అవుతుంది. 
 
రూ.55 కోట్ల భారీ బడ్జెట్‌తో లండన్, దుబాయ్, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించనున్నారు. సత్య, కంపెనీ వంటి విజయవంతమైన గ్యాంగ్ స్టర్స్ చిత్రాలను తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్యాన్సీ చెల్లించి ఈ సినిమా హక్కులను పొందారు. ఈ సినిమా హిందీ వెర్షన్ హక్కులను వేవ్ ఫిలింస్ అధినేత రాజు చద్దా, ఈరోజ్ ఇంటర్రేషనల్ సునీల్ లుల్లా కైవసం చేసుకున్నారు. అలాగే తమిళ హక్కులను సౌతిండియా ఫిలించాంబర్ అధ్యక్షుడు గంగరాజు సొంతం చేసుకున్నారు. 
 
జీనియస్, రామ్ లీలా వంటి చిత్రాలను నిర్మించిన అన్ కాంప్రమైజ్డ్ ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ ప్రస్తుతం రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వంగవీటి సినిమాను నిర్మిస్తున్నారు. ఈయన రాయ్ తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. పలువురు అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఆధ్వర్యంలో లేజర్ కిరణాలతో రాయ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తున్నారు. మే 1న విడుదల కానున్న ఈ ఫస్ట్ లుక్ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు హాజరవుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

పెళ్లాం తన మాట వినడం లేదని పెళ్లి కుదిర్చిన వ్యక్తిని పొడిచి హత్య చేసిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments