ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ సంస్థ ఏమాత్రం రాజీపడకుండా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా అబుదాబీలో షూటింగ్ పూర్తిచేసుకుంది. గత మూడు వారాల
ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ సంస్థ ఏమాత్రం రాజీపడకుండా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా అబుదాబీలో షూటింగ్ పూర్తిచేసుకుంది. గత మూడు వారాలుగా ఇక్కడ తీరికలేని షూటింగ్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్న ప్రభాస్.. పలు కీలక యాక్షన్ సన్నివేశాల్లో దుమ్ము దులిపేశాడని చిత్ర యూనిట్ పేర్కొంది. అన్ని యాక్షన్ సన్నివేశాలను గ్రాఫిక్స్ అవసరం లేకుండా రియల్‌గానే చిత్రించామని వెల్లడించింది.
అబు దాబీలో షూటింగ్ ముగియడంతో ‘సాహో’ టీమ్ యూఏయీ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ ఈ సినిమాకు చెందిన పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఇంతకీ ప్రభాస్ ఏమన్నారంటే... ‘‘మూడు వారాల నుంచి మేం ఇక్కడే షూటింగ్ జరుపుతున్నాం. ఇప్పటివరకు షూటింగులో చాలా కార్లు, ఎస్‌యూవీలు, ట్రక్కులు ధ్వంసం చేసేశాం. రెండేళ్ల కిందటే హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బాట్స్‌తో యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేశాం.
అందుకు అబు దాబీ సరైన ప్రాంతమని కెన్నీ అబు సూచించారు. దీంతో కీలక సన్నివేశాలన్నీ ఇక్కడే చిత్రీకరించాం. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలన్నీ 90 శాతం రియల్‌గా చూపించేందుకు నిజమైన కార్లతోనే యాక్షన్ సన్నివేశాలు చేశాం’’ అని తెలిపారు.
‘‘ఈ షూటింగులో 27 కార్లు, 5 ట్రక్కులు ధ్వంసం చేశాం. యాక్షన్ సన్నివేశాలను సీజీఐతో గ్రాఫిక్స్‌లో చూపించం. అన్నీ రియల్ సన్నివేశాలే ఉంటాయి. వాస్తవానికి మేం 70 శాతం సీజీఐ, 30 శాతం రియల్ అనుకున్నాం. కానీ, అబు దాబీ వచ్చేసరికి అన్నీ నిజంగానే చేయాలని నిర్ణయించాం. ఇప్పటివరకు ఇలాంటి సన్నివేశాలు ఎవరూ చూసి ఉండరు’’ అని ప్రభాస్ అన్నారు.