Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ మైగాడ్.. 2.O ఓ అద్భుతాన్ని సృష్టించింది : రజనీ డాటర్

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (11:02 IST)
శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌లు కలిసి నటించిన చిత్రం 2.O. ఈ మూవీ నవంబరు 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. పూర్తిగా సైంటిఫిక్ పంథాలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం 10 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుద‌లైంది. ఈ చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌ రివ్యూస్ వ‌స్తున్నాయి. 
 
దేశ‌, విదేశాల‌కి సంబంధించిన ప‌లువురు క్రిటిక్స్ ఈ చిత్రంపై పాజిటివ్‌గా ట్వీట్స్ పెడుతున్నారు. ఇక ర‌జనీకాంత్ కూతురు సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ ఒక్క మాట‌లో ఈ మూవీని ఆకాశానికి ఎత్తింది. 'ఓ మై గాడ్!! "2.0" చిత్రం ఇప్పటివరకూ మనం ఈ ప్రపంచంలో చూడని ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది' అంటూ ట్వీట్‌లో పేర్కొంది. త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌తో పాటు పలు బాలీవుడ్ క్రిటిక్స్ కూడా ఈ సినిమా చాలా గొప్పగా ఉందంటూ రివ్యూలు ఇస్తున్నారు. 
 
ఇకపోతే, అక్ష‌య్ కుమార్ పాత్ర‌లో మ‌రో న‌టుడిని ఊహించుకోలేక‌మ‌ని, అమీ జాక్స‌న్ చాలా అద్భుతంగా న‌టించింద‌ని సినిమా చూసిన వారు ట్వీట్స్ చేస్తున్నారు. ఊహించిన‌ట్టుగానే ఈ సినిమా భారీ విజ‌యం సాధించ‌డంతో ఇక రికార్డుల వేట మొద‌లైంది. మొద‌టి రోజు ఈ చిత్రం ఎన్ని కోట్ల వ‌సూళ్లు రాబ‌డుతుందా అని విశ్లేష‌కులు చ‌ర్చించుకుంటున్నారు. 
 
విశ్వనటుడు కమల్ హాసన్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి, హీరోలు సూర్య‌, కార్తి, బెల్లంకొండ శ్రీనివాస్‌, ర‌సూల్ పూకుట్టి వంటి స్టార్స్ ఈ చిత్రానికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. తాను షూటింగ్‌లో ఉండడం వ‌ల‌న తలైవార్ మూవీ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూడ‌లేక‌పోతున్నాని నాని త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇక సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న ట్వీట్‌లో అద్భుత‌మైన రోజు వ‌చ్చింది. 2.0 టీంకి చీర్స్ అంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

APSRTC: మేలో 2వేల బస్సులు కావాలి.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..

రెండు సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నారా? కస్టమర్లకు శుభవార్త చెప్పిన ట్రాయ్

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : ఏపీకి పొంచివున్న భారీ వర్షాలు

'పుష్ప-2' సినిమా చూశాడు... బస్సును హైజాక్ చేసిన దొంగ.. (Video)

నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్.. టెన్షన్ టెన్షన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments