Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మగధీర'కు ఓ పుష్కరం : బయ్యర్లకు లాభాల పంట పండించిన మూవీ

Webdunia
శనివారం, 31 జులై 2021 (16:14 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'మగధీర'. ఈ చిత్రం విడుదలై నేటికి 12 సంవత్సరాలు ఈ చిత్రం గత 2009 జూలై 31వ తేదీన విడుదలైంది. 
 
రూ.40 కోట్ల బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానరుపై ఈ సినిమాను నిర్మించారు. అప్పట్లో ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టారు అని చాలా మంది విమర్శించినా కూడా.. అనుకున్నది చేసి చూపించారు రాజమౌళి. బాక్సాఫీసు వ‌ద్ద‌ రూ80 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి బాలీవుడ్ కూడా బిత్తరపోయేలా చేసింది. 
 
చిరుతతో బిగ్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన రాం చరణ్ రెండో ప్రయత్నంలో ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన చిత్రంగా మగధీర మిగిలిపోయింది.  పైగా, మెగాస్టార్ చిరంజీవిగా చెర్రీ గుర్తింపుపొందారు. అప్పటివరకు తెలుగు సినిమా కలలో కూడా చూడని కలెక్షన్లు మనకు పరిచయం చేసింది ఈ చిత్రం. పునర్జన్మ నేపథ్యంలో రాజమౌళి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. 
 
మగధీర చిత్రానికి కేవలం 40.42 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇన్ని కోట్లు వసూలు చేస్తుందా అనే అనుమానాలకు తెరదించుతూ.. 77.96 కోట్ల షేర్ ను తీసుకొచ్చింది. ఈ చిత్రం బయ్యర్లకు 37.54 కోట్ల భారీ లాభాలు దక్కాయి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments