Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్‌ ఎకౌంట్‌ కోటికి... కానీ సెంటిమెంటుతో 'సరైనోడు' వణుకుడు...

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2016 (17:03 IST)
అల్లు అర్జున్‌ ఫేస్‌బుక్‌కు ఫ్యాన్స్‌ విపరీతంగా వున్నారు. కోటికి పైగా చేరుకున్నారని ఆయన పేర్కొన్నారు. దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమలో ఏ హీరోకీ లేని ఫాలోయింగ్‌ అల్లు అర్జున్‌ ఫేస్‌‌బుక్‌ పేజీకి ఉంది. యాభై కాదు అరవై లక్షలు కాదు బన్నీని లైక్‌ చేసిన వారు ఏకంగా ఒక్క కోటి పైనే ఉన్నారంటే ఆ పేజీకి ఉన్న పవర్‌ ఏంటో అర్థం అవ్వాలి. ఎల్లప్పుడూ ఫ్యాన్సుతో తన ప్రొఫెషనల్‌ సినిమా సమాచారాన్ని, పర్సనల్‌ ఫ్యామిలీ మూమెంట్స్‌ షేర్‌ చేసుకోవడమే బన్నీకి ఈ ఘనత తెచ్చిపెట్టిందంటూ.. గీతా ఆర్ట్స్‌ పేర్కొంది.
 
ఇదిలావుంటే అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న చిత్రం సరైనోడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ముందు చేయి, ఆ తర్వాత మొత్తం మనిషిని చూపిస్తూ క్రేజ్ లాగించారు. కానీ గతంలో అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో నటించిన చిత్రాల సక్సెస్ సెంటిమెంటు గురించి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు కొద్దిగా వణుకు పుడుతోందనే టాక్ వినిపిస్తోంది. 
 
గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అర్జున్ నటించిన మొదటి చిత్రం గంగోత్రి. ఆ తర్వాత హ్యాపీ, బద్రీనాథ్. గంగోత్రి లాంఛింగ్ ప్యాడ్ అనుకున్నా మిగిలిన రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అదలావుంచితే యంగ్ హీరోలతో బోయపాటికి సక్సెస్ గ్రాఫ్ అంత ఆరోగ్యంగా లేదు. ఈ స్థితిలో వస్తున్న సరైనోడు ఎలాంటి రికార్డు సృష్టిస్తాడన్న దానిపై ఆసక్తి నెలకొంది. మరి ఈ రికార్డులను బోయపాటి-అల్లు అర్జున్ అధిగమిస్తారేమో చూడాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments