Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్యావుడా.. ఎస్వీబీసీ యాంకర్‌గా శ్రీరెడ్డి..?

తెలుగు సినీపరిశ్రమలో అవకాశాల కోసం నానా తంటాలు పడుతోంది శ్రీరెడ్డి. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేయడంతో పాటు కొంతమంది డైరెక్టర్లు, నిర్మాతల పేర్లు బయటపెట్టి సంచలనాలకు శ్రీరెడ్డి తెరలేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు న్యూస్ ఛానళ్ళలో

Webdunia
గురువారం, 19 ఏప్రియల్ 2018 (18:48 IST)
తెలుగు సినీపరిశ్రమలో అవకాశాల కోసం నానా తంటాలు పడుతోంది శ్రీరెడ్డి. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేయడంతో పాటు కొంతమంది డైరెక్టర్లు, నిర్మాతల పేర్లు బయటపెట్టి సంచలనాలకు శ్రీరెడ్డి తెరలేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు న్యూస్ ఛానళ్ళలో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ తిరుగుతోంది తప్ప ఎక్కడా శ్రీరెడ్డికి అవకాశాలు మాత్రం రావడం లేదు. కానీ తాజాగా శ్రీరెడ్డికి అదిరిపోయే ఆఫర్ ఇవ్వనున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.
 
అది కూడా ప్రపంచ వ్యాప్తంగా టెలికాస్ట్ అవుతున్న శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లోనే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ఎస్వీబీసీ ఛైర్మన్‌గా అవకాశం ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమైనట్లు చెప్పుకుంటున్నారు. మరో రెండు, మూడురోజుల్లో రాఘవేంద్రరావును ఈ పదవి వరించనుంది. ఆ తరువాత కొత్త యాంకర్లను ఎస్వీబీసీలోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారట దర్శకేంద్రుడు. ఇప్పటికే సంచలనంగా మారిన శ్రీరెడ్డి లాంటి వ్యక్తిని ఎస్వీబీసీలో తీసుకుంటే టిఆర్‌పి పెరగడంతో పాటు తెలుగు అమ్మాయికి అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారట దర్శకేంద్రుడు.
 
ఇదే విషయమై ఇప్పటికే రాఘవేంద్రరావు శ్రీరెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. అవకాశం ఇస్తే ఖచ్చితంగా యాంకర్‌గా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని శ్రీరెడ్డి చెప్పినట్లు కూడా తెలుస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా శ్రీరెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆమెను వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో యాంకర్‌గా పెడితే దర్శకేంద్రుడు మరింత చిక్కుల్లో పడే అవకాశం లేకపోలేదు. ఆధ్మాత్మిక ఛానల్లో శ్రీరెడ్డి లాంటి అమ్మాయిని యాంకర్ ను నియమిస్తే ఛానల్ కు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంటుందని భక్తులే చెప్పక మానరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దర్సకేంద్రుడు ఏ విధంగా శ్రీరెడ్డిని ఎస్వీబీసీలోకి తీసుకువస్తారనేది వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments