Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌కే సవాల్... రూ.1000 కోట్ల దిశగా 'బాహుబలి 2' దూకుడు... న్యూ బెంచ్‌మార్క్?

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చెక్కిన 'బాహుబలి 2 ది కంక్లూజన్' చిత్రం బాలీవుడ్‌కు సరికొత్త టార్గెట్లను నిర్ధేశించే దిశగా దూసుకెళుతోంది. గత నెల 28వ తేదీన విడుదలైన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే రూ.500 కోట

Webdunia
గురువారం, 4 మే 2017 (18:42 IST)
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చెక్కిన 'బాహుబలి 2 ది కంక్లూజన్' చిత్రం బాలీవుడ్‌కు సరికొత్త టార్గెట్లను నిర్ధేశించే దిశగా దూసుకెళుతోంది. గత నెల 28వ తేదీన విడుదలైన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి... రూ.వెయ్యి కోట్ల దిశగా పరుగెడుతోంది. పైగా, భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే బిగ్గెస్ట్ హిట్‌గా అవతరించనుంది. 
 
నిజానికి ఇప్పటివరకు బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ హీరోగా నటించిన 'పీకే', సల్మాన్ ఖాన్ నటించిన 'దంగల్' వంటి చిత్రాల కలెక్షన్లే రికార్డుగా ఉంది. ఈ రికార్డులను 'బాహుబలి' ఇప్పటికే చెరిపేసింది. కేవలం తొలి ఆరు రోజుల్లోనే రూ.792 కోట్లు కలెక్ట్‌ చేసి.. రూ.వేయి కోట్లకు చేరేందుకు పరుగులు తీస్తోంది. వీరి అంచనా నిజమైతే.. రూ.వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన చిత్రంగా తొలి భారతీయ చిత్రంగా బాహుబలి చరిత్రపుటలకెక్కనుంది. 
 
ఈ అద్భుతమైన స్పందన రెండో వారంలోనూ కొనసాగే అవకాశం ఉందని ఫిల్మ్ ట్రేడ్ వర్గాల అంచనా. అందువల్ల పాత రికార్డులన్నీ తుడిచిపెట్టుకునిపోయి సరికొత్త రికార్డును క్రియేట్ చేయనుంది. ఓవర్సీస్ కలెక్షన్స్ చూస్తుంటే ఇదో కలెక్షన్ల సునామీలా ఉందని విశ్లేషకులు అంటున్నారు. 
 
బాలీవుడ్ ఫిల్మ్ విమర్శకుడు తరన్ ఆదర్శ్ ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ... బాహుబలి చిత్రం సరికొత్త బెంచ్ మార్క్‌లను సృష్టించే దిశగా పరుగులు తీస్తోంది. ఇది ఒక్క బాలీవుడ్‌కే కాదు.. ఇంటర్నేషన్ స్థాయిలో కూడా అంటూ ట్వీట్ చేశారు. ఓవర్సీస్‌లో మార్కెట్‌ను పరిశీలిస్తే యుఎస్ఏలో బాహుబలి 2 చిత్రం ఇప్పటికే సరికొత్త రికార్డులను సృష్టించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments