Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళితో సినిమా చేయనంటున్న సమంత.. ఎందుకంటే?

ఎస్.ఎస్.రాజమౌళి. తెలుగు చిత్రసీమలో రాజమౌళికి ఉన్న క్రేజ్ చెప్పనవసరం లేదు. అపజయాలు లేని దర్శకుడు. ఒక సినిమా తీశాడంటే ఆ సినిమా భారీ విజయాన్ని సాధించాల్సిందే. అభిమానులను అంచనాలను మించి సినిమాలను తీయడంలో దర్శకుడు రాజమౌళి దిట్ట. ఈ విషయాన్ని ఎవరు అడిగిన ఇట

Webdunia
శుక్రవారం, 20 జులై 2018 (22:11 IST)
ఎస్.ఎస్.రాజమౌళి. తెలుగు చిత్రసీమలో రాజమౌళికి ఉన్న క్రేజ్ చెప్పనవసరం లేదు. అపజయాలు లేని దర్శకుడు. ఒక సినిమా తీశాడంటే ఆ సినిమా భారీ విజయాన్ని సాధించాల్సిందే. అభిమానులను అంచనాలను మించి సినిమాలను తీయడంలో దర్శకుడు రాజమౌళి దిట్ట. ఈ విషయాన్ని ఎవరు అడిగిన ఇట్టే చెప్పేస్తారు. చేసే సినిమాలు పరిమిత సంఖ్యలో ఉన్నా ఆచితూచి మంచి కథ.. సరిగ్గా సరిపోయే క్యారెక్టర్లను ఎంచుకుని ముందుకు వెళ్ళడం రాజమౌళికి ఉన్న అలవాటు. ఎంతోమంది యువ నటీనటులకు ఇలానే అవకాశాలు ఇచ్చారు రాజమౌళి.
 
కొంతమంది హీరోల రేంజ్‌ను అమాంతం పెంచేశారు కూడా. అలాగే హీరోయిన్లు కూడా. అలాంటి దర్శకుడితో కలిసి పనిచేయాలని ఎంతోమంది హీరో, హీరోయిన్లు పోటీలు పడుతుంటారు. కానీ హీరోయిన్ సమంత మాత్రం రాజమౌళితో సినిమా చేయనంది. ఆమె సినిమా చేయనని చెప్పడానికి రాజమౌళి, సమంతకు మధ్య వైరం ఏమీ కాదండి.. ప్రస్తుతం సమంత మూడు సినిమాల్లో నటిస్తూ బాగా బిజీగా ఉంది. కొత్తగా మరో సినిమాలో నటించేంత సమయం సమంతకు లేదట. చేతిలో ఉన్న సినిమాల్లో నటించడం వల్ల కనీసం ఇంటికి వెళ్ళడానికి కూడా సమంతకు సమయం లేకుండా పోతోంది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో రాజమౌళి త్వరలో తెరకెక్కించనున్న మల్టీస్టారర్ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించమని కోరారట. అయితే అందుకు సమంత ఒప్పుకోలేదట. ఉన్న పరిస్థితిని రాజమౌళికి వివరించే ప్రయత్నం చేసిందట. ఈ సినిమాలో మీరు నటిస్తేనే బాగుంటుందని రాజమౌళి ఒప్పించే ప్రయత్నం చేశారట. అయితే సమంత మాత్రం సున్నితంగా తిరస్కరించారట. ఇప్పుడు ఇదే తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది. సినిమా షూటింగ్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి తరువాత అయినా సమంత ఒప్పుకునే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎవరైనా జక్కన్న సినిమాలో నటించకూడదనుకుంటారా.. చెప్పండి...? సమంత మాత్రం అనేసిందట మరి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments